విశాఖ

ఇరు రాష్ట్రాల అధికారుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 20: ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని ఇప్పటివరకు ఏయే రాష్ట్రాలు ఎంతెంత వినియోగించుకున్నాయనే అంశాలను లెక్కించడానికి సీలేరులో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు డిసెంబర్‌లో ఆంధ్రా వాటాగా 3.6993 టిఎంసిల, ఒడిశా వాటాగా 6.81138 టిఎంసిలను వాడుకున్నట్టు లెక్కలు తేల్చారు. అలాగే గత ఏడాది 2015-16లో ఆంధ్రా 47.1813 టిఎంసిల నీటిని అధికంగా వాడుకుందని సమావేశంలో తేల్చారు. ఈ ఏడాది 2016-17లో జూలై నుండి డిసెంబర్ నెలవరకు 18.5860 టిఎంసిల నీటిని వినియోగించుకున్నట్లు లెక్కించారు. ఆంధ్రా గతేడాది 2015-16 నీటి వాడకంతో కలుపుకొని ఈ ఏడాది 2016-17 డిసెంబర్ వరకు మొత్తంగా 61.7673టిఎంసిల నీటిని ఆంధ్రా తన వాటాగా వినియోగించుకున్నట్టు తేల్చారు. ఒడిశా ఈ ఏడాది జూలై నుండి డిసెంబర్ నెలాఖరు వరకు 32.1513 నీటిని మాత్రమే వినియోగించుకుందని లెక్కలు తేల్చారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 90 టిఎంసిల నీరు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. గత ఏడాది నుండి డిసెంబర్ వరకు ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలు చూస్తే ఆంధ్రా ఒడిశా కంటే 33.6160 టిఎంసిల నీటిని అధికంగా వాడుకోవడంతో ప్రస్తుతమున్న 90టిఎంసిల్లో ఆంధ్రాకు 28.1920 టిఎంసిలు, ఒడిశాకు 61.8080 టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే ఇరు రాష్ట్రాల వాటాలను వారికి ఉన్న ఇరిగేషన్, గ్రిడ్జ్ డిమాండ్ అవసరాల నిమిత్తం ప్రస్తుతం ఆంధ్రా నాలుగువేల క్యూసెక్కుల నీటిని, ఒరిశా 2300 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కుదుర్చుకున్న ఒప్పందం కంటే అధికంగా నీరు అవసరమయితే ఆంధ్రా-ఒడిశా అధికారులు సమావేశమై చర్చించుకుని నీటిని విడుదల చేసుకునేలా ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రా తరపున ఏపి జెన్‌కో అధికారులు ఎస్‌ఇ మురళీమోహన్, ఇఇ విఎల్ రమేష్, డిఇ కె. సుధాకర్, ఒడిశా తరపున అధికారులు చీఫ్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ హర్షవర్ధన్ మహంతి, బలిమెల ప్రాజెక్టు సిసిఇ తరుణ్ కంటిదాస్ తదితరులు పాల్గొన్నారు.