విశాఖ

ఆదర్శంగా సిఎం దత్తత పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీని ఆదర్శనీయ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ -2 వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి దత్తత పంచాయతీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో విస్తృతంగా శనివారం పర్యటించారు. నువ్వగుడ, పాతబిస్తుంగుడ, పిట్టమామాడివలస గిరిజన గ్రామాల్లో ఆయన సుడిగాలిలా పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అదే విధంగా ఆయా గ్రామాల్లోని గిరిజనులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి దత్తత పంచాయతీ పరిధిలోని 22 గిరిజన గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించడంతో పాటు మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లనిచ్చి మంచినీటి సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనుల ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు, పేద కుటుంబాలకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. సి.ఎం. దత్తత పంచాయతీలోని గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా అందరికీ బ్యాంక్ ఖాతాలు ప్రారంభించి రూపె కార్డులను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా గిరిజన సహకార సంస్థ నిత్యావసర వస్తువుల విక్రయశాలలో స్వైపింగ్ మిషన్ల ద్వారా సరుకులు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా వైఫై సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. మొట్ట మొదటిసారిగా పెదలబుడు దత్తత గ్రామంలో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 149 రూపాయలకే వైఫై సేవలందించాలని నిర్ణయం తీసుకుని ఈ పనులకు సంబంధించి ముందడుగు వేస్తున్నామన్నారు. నర్సీపట్నం సమీపంలోని ధర్మవరం తరహాలో ఫైబర్ గ్రిడ్ ద్వారా వైఫై సేవల సౌకర్యాన్ని గిరిజనులకు అందించనున్నట్టు వెంకటరెడ్డి చెప్పారు. అనంతరం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ముఖ్యమంత్రి దత్తత పంచాయతీలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.