విశాఖ

ఆలిండియా పోస్టల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ కర్ణాటక కైవశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 21 : ఆలిండియా పోస్టల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను కర్ణాటక జట్టు కైవశం చేసుకుంది. కాగా కేరళ జట్టు ద్వితీయ స్థానం, పశ్చిమబెంగాల్ జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయి. పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక జట్టు 25-18, 25-17, 29-31, 25-19 (3-1) స్కోరుతో కేరళ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలిరెండు సెట్లను సునాయాశంగా గెలుచుకున్న కర్ణాటక జట్టును మూడవ సెటల్‌లో కేరళ జట్టు గట్టిపోటీ ఇచ్చి 31-29 స్కోరుతో సొంతం చేసుకుంది. అయితే నాలుగవ సెట్ ఆరంభంలో కేరళ జట్టు ఆధిక్యతలో నిలిచిప్పటికీ కర్ణాటక జట్టు బ్లాకింగ్, స్ట్రైకింగ్, డిఫెన్స్‌లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 25-19 స్కోరుతో గెలుపొందింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో కర్ణాటక జట్టు ఉత్తరప్రదేశ్‌పై, కేరళ జట్టు పశ్చిమబెంగాల్ జట్టుపై విజయాలు సాధించాయి. మూడవ స్థానానికి జరిగిన పోటీలో పశ్చిమబెంగాల్ జట్టు ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కర్ణాటక ఆటగాడు రైజిన్ బెల్లి బెస్ట్‌ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఫైనల్ పోటీ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎం. సంపత్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్‌మాస్టర్ జనరల్ (విశాఖ) టి ఎం శ్రీలత, అర్జున అవార్డు గ్రహీత ఎ. రమణారా, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతన్‌రావు, ఎస్. కోదండరామయ్య, ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు.

ఎం.అలమండలో కోనాం గట్టుకు గండి
దేవరాపల్లి, జనవరి 21: కోనాం గట్టు గండిపడడంతో 20 ఎకరాల పంట మునిగిపోయింది. నాలుగు తాటాకు ఇళ్లు మునిగిపోయాయి. మండలంలోని ఎం.అలమండ గ్రామంలోని కోనాం గట్టు శనివారం తెల్లవారు జామున కొట్టుకుపోవడంతో 10 మందికి చెందిన 20 ఎకరాల పంట ముంపునకు గురై నష్టం వాటిల్లింది. గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే తహశీల్దార్ వైఎస్ నాగరాజు, ఆర్‌ఐ చంద్రరరావు, మండల వ్యవసాయాధికారి డి.అప్పారావు ముంపునకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. కోనాం గండి ఎలా కొట్టిందని అక్కడున్న రైతులను అడిగి తెలుకున్నారు. ఈ ముంపులో పెసర, మినుము, వరి పంటలు పూర్తిగా మునిగిపోయాయని ఈ పంటలు ఎందుకు పనిరావని రైతులు తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. నష్టాన్ని అంచనా వేశారు. ఇదే విషయాన్ని అనకాపల్లి ఆర్డీఓకు, కలెక్టర్‌కు నష్టం జరిగిన నివేదికను అందజేస్తానన్నారు.