విశాఖ

రైతులకు రూ.150 కోట్లు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జనవరి 23: వచ్చే రబీకాలంలో జిల్లాలో ఉన్న సహకార బ్యాంక్ ల నుండి సుమారు 1.10 లక్షల మంది రైతులకు 150 కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేస్తామని డిసిసిబి చైర్మన్ పి సుకుమార్‌వర్మ స్పష్టం చేసారు. స్థానిక పిఎసిఎస్ ఆవరణలో విలేఖర్లతో చైర్మన్ సుకుమార్‌వర్మ, స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ మాట్లాడుతూ రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రుణా లు మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. జిల్లాలో ఉన్న రైతులు విత్తనాలకు ఎక్కడా ఇబ్బంది పడకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రుణాల మంజూరులో సహకార బ్యాంక్‌లు మందుంటాయన్నారు. అలాగే రూపేకార్డులు రైతులకు అందజేసి నగదురహిత లావాదేవీలు చేస్తామన్నారు. బంగారంపై ఎక్కువగా రుణాలు అందజేస్తామన్నారు. కశింకోటలో 25లక్షలతో గుడౌన్‌ను, ప్రహరీగోడను నిర్మిస్తామన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి తమ బ్యాంక్‌ల నుండి మిల్లర్లకు అమ్మకాలు చేస్తామని దీని ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా రైతుల వద్ద నుండి ధాన్యంను కొలుగోలు చేసారు. డిసిసిబి డైరక్టర్, స్థానిక పిఎసిఎస్ అధ్యక్షులు శిదిరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుచోళ్ల నాగేశ్వరీ, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వేగి రామకోటేశ్వరరావు, సొసైటీ డైరక్టర్లు, సొసైటీ కార్యదర్శి మావూరి ప్రకాష్, దేశం పార్టీ నాయకులు కాయల మురళీధర్, నిమ్మదల త్రినాథరావు, ఉగ్గిన రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.