విశాఖ

అభివృద్ధి పనులకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో విలీనమైన భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ తెలిపారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, జివిఎంసి కమిషనర్ హరినారణన్, వుడా విసి బాబూరావునాయుడు నగర ఎమ్మెల్యేలతో కలిసి వుడా కార్యాలయంలో ఆదివారం ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విలీన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నెమ్మదించాయని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించారు. రెండు విలీన మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపిఎస్) నిధులు రూ.100 కోట్లు, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.70 కోట్లు, అమృత్ నిధులు రూ.35 కోట్లు జివిఎంసి తరపున ఖర్చు చేస్తామన్నారు. దీనికి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి రూ.45 కోట్లు జోడించి పనులు ప్రారంభిస్తామన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. అందరికీ ఇళ్లు పథకం కింద నగరానికి మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్టట్టు తెలిపారు. నగరంలో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 10 రోజుల్లో స్థలాల ఎంపిక పూర్తి చేస్తామని తెలిపారు. రెండు విధాలుగా నిర్మించే ఇళ్ల యూనిట్ ధర రూ.6.5 లక్షలు, రూ.5.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తంలో రూ.3 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగాను, మరో రూ.3 లక్షలు బ్యాంకు రుణంగాను, మిగిలిన రూ.50 వేలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెండో తరగతి యూనిట్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలో మార్పు లేనప్పటికీ, బ్యాంకు రుణం రూ.2.5 లక్షలు, లబ్ధిదారు వాటాగా రూ.5వేలు చెల్లించాలన్నారు. యూనిట్ మొత్తం విలువలో రూ.1.25 లక్షలు ప్రాథమిక, సామాజిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తామన్నారు. ఒక్కో యూనిట్ 360 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటిలో హాల్, బెడ్‌రూం, కిచెన్, బాత్‌రూం ఉంటాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పిజివిఆర్ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, పి విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.