విశాఖ

వైభవంగా గౌరీపరమేశ్వరుల మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జనవరి 29: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి గవరపాలెం శ్రీ గౌరీపరమేశ్వర్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో నేలవేషాలు, స్టేజ్ పోగ్రంలు, బళ్లవేషాలు, తప్పెడగుళ్లు, చిడతలు, సాముగరిడీలు, డాన్స్‌బేబిడాన్స్, బుర్రకథలు, ఆర్కెష్ట్రా, పౌరాణిక నాటికలు తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం రాత్రి జరిగాయి. ఈ మహోత్సవం ను తిలకించేందుకు లక్షలాది మంది ప్రేక్షకులు తరలివచ్చారు. అనకాపల్లిని ఆనుకుని ఉన్న జాతీయరహదారిపై సైతం భారీ వాహనాలు నిలిపివేసి సంబరాన్ని చూసేందుకు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ మహోత్సవం చూసేందుకు ప్రజలు తరలిరావడంతో అనకాపల్లి పట్టణం కిక్కిరిసిపోయిం ది. ఎటుచూసిన జనాలు ఉండటంతో దారి తెలియక కొందరు, స్నేహితులుతో వచ్చిన కొందరు తప్పిబోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబరంలో భారీలైటింగ్,డిజిటల్ స్క్రీన్స్, సౌండ్‌సిస్టమ్స్ తదితర ఆదునిక పరికరాలతో సెట్టింగ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఉత్సవకమిటీ చైర్మన్ కొణతాల సంతోష్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వాహకులు కొణతాల బాబురావు, మళ్లసురేంద్ర, పివి రమణ, కొణతాల మురళీ, పీలా శ్రీనివాసరావు, బుద్ద భూలోకనాయుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి స్టేజ్ వద్ద ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ వాయిస్ రికార్డును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ మహోత్సవాన్ని చూసి క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుతున్నామని అలాగే తమ దగ్గరున్న విలువైన వస్తువులను జాగ్రత్తచేసుకోవాలని, తోపులాటలు జరగకుండా, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిందిగా ఆ రికార్డులో ఎమ్మెల్యే పీలా పేర్కొన్నారు. డిఎస్‌పి పురుషోత్తం ఆధ్వర్యంలో భారీగా పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి టౌన్ సి.ఐ విద్యాసాగర్, రూర ల్ సి.ఐ రామచంద్రరావు వివిధ మండల ఎస్.ఐలు తమ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌లు తగిన చర్యలు తీసుకున్నారు.