విశాఖ

ఆధునిక హంగులతో ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జనవరి 31: ఆధునిక హంగులతో చోడవరం ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి చేసి, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దనున్నట్టు ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు తెలిపారు. మంగళవారం ఆయన ఇంజనీరింగ్ అధికారులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సుమారు రెండుకోట్ల రూపాయలతో ‘యు’ ఆకారంలో చేపట్టనున్న నూతన భవన సముదాయ నిర్మాణం, వౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడు మండలాలకు ప్రధాన కూడలిగా ఉన్న చోడవరం ప్రభుత్వాసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా పెంపుచేసి మహిళలకు, పురుషులకు వేర్వేరు వార్డుల ఏర్పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అలాగా ఆసుపత్రికి వచ్చేరోగులకు వైద్య సేవలందించేందుకు వీలుగా ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్ యంత్రాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలను, ఫర్నీచర్, చలువరాతి పలకలతో అందమైన ఫ్లోరింగ్ నిర్మాణంతో నూతన భవన సముదాయం నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే ఈ నూతన భవన సముదాయంలో ఏడుగురు డాక్టర్లు ఏకకాలంలో సేవలందించడానికి వీలుగా నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి పరిచేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. ఈ అభివృద్ధి పనులు వైద్యాభివృద్ధి శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, వైద్య సిబ్బంది ఆయా పనులను పర్యవేక్షించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా సహకరించాలన్నారు.
అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో నూతన భవనాల నిర్మాణం ఏ విధంగా జరపాలి, ఏయే భవనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి తదితర పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ దేవరపల్లి వెంకటప్పారావు, జెడ్‌పిటిసి కనిశెట్టి మత్స్యరాజు, సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి, మాజీ ఎంపిపి గూనూరు సత్యనారాయణ, డాక్టర్లు ఉషారాణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఆల్‌ఇండియా హకీ టోర్నమెంట్ అంపైర్‌గా గోపినాధ్
కశింకోట, జనవరి 31: హాకీ ఎపి ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండు నుండి ఐదు వరకు ధర్మమాంబ అథిలటిక్ అసోషియేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఆల్‌ఇండియా హాకీ టోర్నమెంట్‌కు స్థానిక డిపిఎన్ జిల్లాపరిషత్ హైస్కూల్‌కు చెందిన పి.డి ఉపాధ్యాయులు టి.గోపినాధ్ అంపైర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు డిఇఓ నుండి ఉత్తర్వులు అందాయి.
రాష్టస్థ్రాయి అంపైర్ ఫ్యానల్‌కు ఎన్నుకున్నందుకు తనకు మంచి గౌరవం దక్కిందని గోపినాధ్ స్థానిక విలేఖర్లకు తెలిపారు. గోపినాధ్‌ను స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీ్ధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు దాడి కాళిదాసు, బొడ్డేడ అప్పారావు, బీశెట్టి ఆనంద్‌కృష్ణారావు, పొలమరశెట్టి గణేష్‌లు అభినందించారు.