విశాఖ

ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ సిపి నాయకులు కరణం ధర్మశ్రీ అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని రాయపురాజుపేట గ్రామంలో గడపగడపకూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామంలోని స్థానిక సమస్యలపై ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్ర బాబునాయుడు ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతోనే పాలన సాగిస్తుందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని, రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన సిఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు. డ్వాక్రా మహిళలతోపాటు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయన్నారు. ఇటువంటి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం శాస్వత అభివృద్ధి పనులను ఏమాత్రం చేపట్టకుండా కేవలం తాత్కాలిక పనులపైనే శ్రద్ధ చూపుతోందన్నారు.
అంతకుముందు గ్రామంలో ప్రదర్శనగా వెళ్లి అందరినీ పేరుపేరున పలకరిస్తూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొడ్డేడ సూర్యనారాయణ, అప్పికొండ లింగబాబు, ఎంవి శ్రీకాంత్, అల్లం రామఅప్పారావు, మళ్ల శ్రీను, సూరిశెట్టి నాగగోవింద, మొల్లి ప్రసాద్, డి.హనుమంతు, దాడి సూరిబాబు, బి. శ్రీను పాల్గొన్నారు.