విశాఖ

రికార్డులు అప్పగించకుండా నాటకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 10: మండలంలోని విజయరామరాజుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యదర్శి దొడ్డి మహలక్ష్మినాయుడు బదిలీ అయినప్పటికీ, రికార్డులు అప్పగించకుండా నాటకాలాడుతూ రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారంటూ రైతులు శుక్రవారం పేట సొసైటీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇతన్ని చీడికాడ పిఎసిఎస్‌కు బదిలీ చేసినప్పటికీ, అక్కడికి వెళ్లకుండా, ఇక్కడకు బదిలీపై వచ్చిన వారికి రికార్డులు అప్పగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సొసైటీ అధ్యక్షుడు శిలపరశెట్టి వెంకట గిరి అధ్వర్యంలో గ్రామంలోని అన్ని పార్టీలకు చెందిన నాయకులు, సొసైటీ డెరెక్టర్లు, సభ్య రైతులు సమావేశమయ్యారు. కార్యదర్శి ఏకపక్ష నిర్ణయం వలన సకాలంలో రుణాలు చెల్లించలేకపోతున్నామని, రుణాలు చెల్లించటానికి రైతులు సొసైటీకి వస్తే తమ వద్ద రికార్డుల లేవని కొత్తగా వచ్చిన సిబ్బంది చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వలన ప్రభత్వం ఇచ్చే వడ్డీ రాయితీని కోల్పోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవిత కాలంగా ఇక్కడే పనిచేసిన ఈ కార్యదర్శి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వెంటనే సొసైటీపై 51ఎంక్వయిరీ చేపడితే పలు అక్రమాలు బయట పడతాయని రైతులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ కార్యదర్శి కొమ్ముకాస్తున్నారంటూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల, డిసిసిబి అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకులు కల్పించుకొని సదరు కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని రైతులు మండిపడ్డారు. తక్షణమే సొసైటీలో లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిసిసిబి అధికారులను వారు డిమాండ్ చేశారు. లేకుంటే సోమవారం నుండి సభ్య రైతులంతా విశాఖపట్నంలోని సెంట్రల్ బ్యాంక్ ఎదుట వంటా
వార్పు కార్యక్రమాన్ని చేపట్టి అక్కడే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
రైతుల నిలువుదోపిడీ
విజయరామరాజుపేట పిఎసిఎస్ సిబ్బంది రైతులను నిలువు దోపిడీ చేశారని పలువురు రైతులు శుక్రవారం విలేఖరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామానికి చెందిన శరగడం అప్పలనాయుడు అనే రైతు సొసైటీ సిబ్బంది మాటలు నమ్మి తాను, తన భార్య వేర్వేరుగా సొసైటీలో ఆర్‌డిలు తెలిచామని, నెలనెలా మూడు వేల వంతున జమ చేశామని చెప్పారు. తాము ఒక్కొక్క ఖాతాలో 18వేల వరకు జమ చేస్తే ప్రస్తుతం తమ ఖాతాల్ల ఆరువేల రూపాయలే ఉన్నాయని ఆయన కన్నీళ్ళపర్యంతమయ్యారు. అలాగే పలువురు రైతులు తాము రుణాల కోసం చెల్లించిన డబ్బు తమ ఖాతాల్లో పడలేదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గిరితో పాటు మాజీ సిడిసి చైర్మన్ కర్రి తమ్మునాయుడు, వైసిపి నాయకులు వేగి మహలక్ష్మినాయుడు, కాంగ్రెస్ నాయకులు దొడ్డి జగన్నాథరావు, తెలుగు దేశం నాయకులు శరగడం ఆదిబాబు, సొసైటీ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.