విశాఖ

జాతీయ రహదారికి రోడ్ల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: విశాఖ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది. కేంద్ర రహదారులు, జాతీయరహదారుల మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంతో విశాఖ జిల్లా మండల కేంద్రాలను కలుపుకుంటూ 165 కిలోమీటర్ల మార్గంలో రోడ్ల నిర్మాణంతో జాతీయ రహదారికి అనుసంధానం కానున్నాయి. దీనికి సంబంధించి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సభలో అనేకసార్లు దీని గురించి చేసిన ప్రస్తావన చివరకు చర్చగా మారి వీటికి అనుమతి లభించినట్టు చేసింది. ఒడిశా పరిధిలోకి వచ్చే మల్కనగిరి నుండి విశాఖ జిల్లా ఏజెన్సీ మండల కేంద్రం అయిన చింతపల్లి నుంచి నర్సీపట్నం, వడ్డాది, చోడవరం, సబ్బవరం మీదుగా ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ 165 కిలోమీటర్ల మేర మార్గంలో రాష్ట్ర రహదారులను నిర్మిస్తూ వీటిని జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గట్కారీ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి రోడ్డు అభివృద్ధికి ఎక్కువుగా నిధులు వస్తాయని, గ్రామాలను కలుపుతూ ఉండడం వలన వ్యాపారపరంగా, పారిశ్రామికంగా, అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు వీలువుతుందన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గట్కారీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన అభినందనలు తెలియజేశారు.