విశాఖ

నాణ్యత లేకుంటే వేటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, ఫిబ్రవరి 18: నాణ్యతలేని నిర్మాణాలు చేపడితే వేటు తప్పదని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన డుంబ్రిగుడ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ అభివృద్ధిని తీరు తెన్నులను పరిశీలించారు. పిఎంజివై నిధులతో జామిగుడ నుంచి బొడ్డాపుట్టు వరకూ నిర్మించిన బిటి రోడ్డు నాణ్యత లేకపోవడాన్ని గమనించిన ఆయన ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. నాణ్యత లేని నిర్మాణాలను చేపట్టి ప్రజాధానాన్ని వృథా చేస్తున్నారన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. అంతకుముందు ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వగది, ప్రసూతిగడి, రోగుల గదులను పరిశీలించారు. మందులు భద్రపరిచే గదికి కిటికీలు తెరిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఆసుపత్రిలో ఒకే ఒక వైద్యురాలు ఉండడాన్ని తెలుసుకున్న కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని ఫోన్‌ద్వారా కారణాలను నివేదించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయులు విద్యార్థులు అందిస్తున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సంవత్సరం పంపిణీ చేయాల్సిన ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదని బాలికలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఆయన జిల్లా సిఎంఒ ఎ.స్వప్న ప్రియారెడ్డికి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న స్నానాల గదులను పరిశీలించిన ఆయన తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాణ్యతలేని నిర్మాణాలు చేపడితే వేటు తప్పదని హెచ్చరించారు. అనంతరం ఆయన ఓ ద్విచక్రవాహనంపై మారుమూల టడ్డా గ్రామాన్ని సందర్శించడంతో ఆ గ్రామ గిరిజనులు పడ్డ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. పునుపెన్నడూ ఏ ఉన్నతస్థాయి అధికారి ఆ గ్రామాన్ని సందర్శించకపోవడంతో గ్రామస్థులు సంతోషంతో ఆయనకు స్వాగతం పలికి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం గుంటసీమ పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. అదే సమయంలో ఓ ఉపాధ్యాయుడు బోధిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్, పాడేరు ప్రాజెక్టు అధికారి పటాన్‌శెట్టి రవిసుభాష్‌లు విద్యార్థులతో సహ పంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జమున, జెడ్పీటీసీ కుజ్జమ్మ, తహశీల్దార్ బాబు సుందరం, ఎంపీడీఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.