విశాఖ

కాంతులీనుతున్న శివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని వివిధ శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులు దర్శనాలు చేసుకునేందుకు అనువుగా క్యూలైన్లు, విద్యుద్దీపాలంకరణలు, మంచినీటి సదుపాయం తదితర వాటిని ఏర్పాటు చేశారు. అతి పురాతనమైన స్థానిక గవరపాలెంలోని భోగలింగేశ్వర స్వామి ఆలయం, గవరపాలెం గౌరీపంచాయతన దేవాలయం, వేల్పులవీధిలోని కాశీవిశే్వశ్వర స్వామి ఆలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించారు. మెయిన్‌రోడ్డులోని సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయం, గాంధీమార్కెట్ వద్ద సాదువులమఠం, శారదానది తీరానగల ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, మునగపాక మండలంలోని వాడ్రాపల్లిలోని దక్షిణాదీశ్వర స్వామి ఆలయం, పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి తదితర ఆలయాలకు భక్తులు అనూహ్య సంఖ్యలో తరలిరానున్నారు. ఆయా ఆలయాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

కశింకోటలో వరికుప్పలు దగ్ధం
కశింకోట, ఫిబ్రవరి 23: స్థానిక శారదానది అవతలి వైపు ఉన్న రైతు కమతాల్లో కుప్పలుగా ఏర్పాటు చేసిన వరికుప్పలు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. కశింకోట శారదానది అవతలి వైపు ఉన్న శిలపరశెట్టి అప్పారావు, పెంటకోట సత్యనారాయణ, పెంటకోట శ్రీనివాసరావు, శిలపరశెట్టి సిన్న, పెంటకోట సత్యవతి, పెంటకోట నాగేశ్వరరావు, పెంటకోట వెంకటరమణ తదితరులకు సంబంధించిన వరికుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు ఒంటి గంట ప్రాంతంలో రాజేసుకున్న అగ్గి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పినా రాత్రి ఎనిమిది గంటల వరకు అగ్గి రేజవుతూనే ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు ఆరలేదు. ఒకవైపు ట్యాంక్‌లో నీరు అయిపోయినా సమీపంలో ఉన్న బావిల వద్దకు ఫైర్ సిబ్బంది రైతులు పరుగులు తీసారు. అయినప్పటికీ నీరు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు. ఆర్‌ఇసిఎస్ అధికారులకు సమాచారం తెలియజేసి విద్యుత్ సఫ్లై చేయమని అడిగినా పావుగంట సేపు సరఫరా చేసి నిలిపివేశారు.
అయితే, నీరు లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఆరువరికుప్పల మంటలను ఆపిన అనంతరం మరో రెండుకుప్పల్లో వస్తున్న మంటలను నిలిపివేసేందుకు నీరు లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ మంటలు ఆర్‌ఇసిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ కింద ఉన్న వరికుప్పలకు అంటుకుని మంటలు వచ్చినట్లు రైతులు చెపుతున్నారు. రైతులు ఎవరూ ఆ సమయంలో లేరని కేవలం షార్ట్‌సర్క్యుట్‌తో మాత్రమే ఈ మంటలు వ్యాపించి ఒకకుప్పతరువాత మరొకటి అంటుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పాటు కష్టపడి పండించుకున్న పంటలు మంటలకు ఆహుతవ్వడంతో తమ దిక్కు ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌కు, ఎండలకు, ప్రకృతికి ఇటువంటి మంటలకు అన్నింటికీ తామే బలైపోతున్నామని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంటలకు ఆగకపోవడంతో అక్కడ ఉన్న మరికొన్ని వరికుప్పలను వేరే ప్రాంతానికి రైతులు తరలించారు. అయితే ఫైర్ సిబ్బంది మంటలను నిలుపుదల చేసేందుకు వారు తీవ్రంగా కష్టించారని రైతులు చెపుతున్నారు.