విశాఖ

రైల్వేజోన్ కోసం సంతకాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఏప్రిల్ 12 : విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించేందుకు అన్ని అర్హతలు వున్నా వాల్తేరుని పక్క పెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం జివి ఎంసి గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ( ఎపిజి ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి పి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రెండు దశాబ్ధాల కారణంగా విశాఖ ప్రజానీకం ఎదురు చూస్తున్న రైల్వే జోన్ డిమాండ్ మాత్రమే కాదని విశాఖ ప్రజల హక్కు అన్నారు. విశాఖకు రైల్వే జోన్ సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని నేటికి ఆ దిశగా చర్యలు జరగడం లేదన్నారు. గతంలో విపక్షంలో వున్న బిజిపి, టిడిపిలు కూడా హామీలు వెల్లబుచ్చామని, అధికారంలోకి వచ్చిన తరువాత మోసపూరిత మాటలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి లేకుండా జాప్యం చేస్తోందన్నారు. ఎపిజె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ చాలా కాలంగా విశాఖ ప్రజల డిమాండ్‌గా వున్న రైల్వే జోన్ రాష్ట్ర విభజన అనంతరం పునర్విభజన చట్టంలో పొందుపరచిన విధంగా విశాఖ హక్కుగా మారిందని ఈ హక్కును సాధించేందుకు విశాఖ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైసిపి, పలు మహిళా సంఘాల నాయకులు, అధికారులు, మేథావులు పాల్గొని ఉత్సాహంగా సంతకాల సేకరణ చేశారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయప్రసాద్, వై ఎస్ ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు గొల్ల బాబూరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పసుపులేటి ఉషాకిరణ్, ఎయూ మాజీ విసి ఆచార్య జి ఎస్ ఎన్ రాజు, ఎయు రిజిస్ట్రార్ ఉమామహేవ్వరరావు, ఇంటక్ అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, పలువురు నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, పి.దివాకర్, జె.టి.రామారావు, ఎ ఎ జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌదరి తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన 60 అడుగుల పొడవు గల భారీ ఫ్లెక్సీ అందరిని ఆకట్టుకుంది.