విశాఖ

లారీల సమ్మె ప్రభావం ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ నెల 30వ తేదీ నుండి రాష్టవ్య్రాప్తంగా సమ్మె చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరకులకు ఇబ్బందులు లేకుండా ముందుగా సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రాన్స్‌పోర్టు, ఆర్టీసీ, పోలీసు, పౌర సరఫరాలు, లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ దుకాణాలకు అందజేసే నిత్యావసర సరకులను బుధవారం సాయంత్రం నాటికి పంపిణీ చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్, పెట్రోల్ బంకుల్లో నిల్వ ఉంచుకునే విధంగా ఆదేశించారు. రోజు వారి సరఫరా చేసే బియ్యం, పాలు, నీరు, కూరగాయలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. రైతుబజార్లు, మార్కెట్లకు సరఫరా చేసేర కూరగాయలను సిటీ బస్సుల్లో పంపిణీ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా సమ్మెను చేసుకోవాల్సిందిగా లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. టిడిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుండి దక్షిణ ప్రాంత ఐదు రాష్టాల లారీ ఓనర్ల అసోసియేషన్లు సమ్మెను తలపెట్టాయన్నరు. నగరంలో సుమారు 10వేల లారీలు తిరుగుతున్నాయని, వాటిలో క్వారీ లారీలు, అయిలు ట్యాంకర్లు, గాజువాక, అనకాపల్లి, ఆనందపురం, విజయనగరం లారీలు, మిని వ్యాన్లు ప్రతిరోజు సరుకులను రవాణా నిమిత్తం తిరుగుతున్నాయన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఎంబర్ 1800 4250 0002, డిటిసి కంట్రోల్ రూమ్ నెంబర్ 9849100729 నిరంతరంగా పని చేస్తాయన్నారు. ఈ సమావేశంలో జెసి జి.సృజన, ఆర్టీసీ ఆర్‌ఎం సురేష్‌కుమార్, ఎడిషనల్ సిపి మహేంద్రపాత్రుడు, పట్టణ, గ్రామీణ డిఎస్‌ఓలు నిర్మలాభాయి, ఆనంద్‌కుమార్, కలెక్టరేట్ సి.సెక్షన్ సూపరింటెండెంట్ రామలక్ష్మి, లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.