విశాఖ

వార్షిక రుణం రూ.15,553కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: ఈ ఆర్ధిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికలు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.15,553 కోట్ల రుణ వితరణను లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నాబార్డు రూపొందించిన క్రెడిట్ ప్లాన్ ఆధారంగా గత ఏడాది కన్నా 10 శాతం పెంపుతో రూపొందించారని ఆయన అన్నారు. కేటాయింపులను అధిగమించేలా పనితీరును కనబరచాలని బ్యాంకులను, వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. 2016-17 రుణ ప్రణాళిక లక్ష్యాలను సమీక్షిస్తూర వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక రుణ మంజూరు చాలా తక్కువుగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 డి.వెంకటరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ శరత్‌బాబు, నాబార్డు ఎజిఎం ప్రసాదరావు, ఇతర బ్యాంకుల ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.