విశాఖ

ఆత్మగౌరవ యాత్రకు పెరుగుతున్న మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి నెహ్రూచౌక్), మార్చి 31: ఉత్తరాంధ్రుల హక్కు అయిన రైల్వేజోన్ సాధనకు వైఎస్సాఆర్‌సీపి జిల్లా అధ్యక్షులు గుడువాడ అమర్‌నాథ్ చేపట్టి అనకాపల్లి నుండి గురువారం ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్ర ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు నడుమ అత్యంత ఉత్సహంగా సాగుతుంది. యాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని గోపాలపురం గ్రామం నుండి ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమయింది. అమర్‌తోపాటు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కొయ్య ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, దామా సుబ్బారెడ్డిలకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అమర్‌తోపాటు ఇతర నాయకులకు మొర పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా గోపాలపురంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ ఈయాత్ర అన్ని వర్గాల వారికి సంబందించిందని విశాఖకు రైల్వేజోన్ వచ్చినట్లు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ పాలనతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్సాఆర్ సిపి అధికారంలోకి రావడం కాయమన్నారు. ఇప్పటికే అధికార పార్టీలపై ప్రజలు విసిగి వేసారి ఉన్నారని, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. గోపాల పురం నుండి ప్రారంభమైన యాత్రలో వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, జిల్లా అధికారప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు, కశింకోట మండల అధ్యక్షులు గొల్లవెల్లి శ్రీనువాసరావు, దంతులూరి శ్రీ్ధర్‌రాజు, జాజుల రమేష్, బీశెట్టి జగన్ అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.