విశాఖ

రెండు రోజుల పాటు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఎగురవేయాలన్నారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు వారికి సరైన సూచనలు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. అన్ని తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలు, తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1077కు, 180042500002కు, 9849913705కు, 0891-2735606కు, 0891-2735665కు వెంటనే ఫోన్ చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.