విశాఖ

2018 నాటికి సబ్బవరం ఐఎంయు తరగతులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జూన్ 15: 2018-2019 విద్యాసంవత్సరానికి సబ్బవరం మండలం వంగలి వద్ద 66కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇండియన్ మారిటైం యూనివర్శిటీని పూర్తిచేసి వచ్చేయేడాది నుంచి తరగతులు ఇక్కడ నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఇక్కడి ఐఎంయు సైట్ ఇంజినీరింగ్ అధికారులు సి.రవికుమార్, డాక్టర్ రవి చంద్రన్‌లు తెలిపారు. గురువారం ఇక్కడి యూనివర్శిటీ నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చిన వారు స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖలోని సింధియా వద్ద తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్న ఇండియన్ మారిటైం యూనివర్శిటీలో 240 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. అయితే ఈ యూనివర్శిటీలో సీటు సంపాందించేందుకు తాము ప్రతీ యేడాది ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించే ఐఎంఇ ప్రవేశపరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణుకావాల్సి ఉంటుందన్నారు.
అయితే ఇక్కడి మారిటైం యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో నేవల్ ఆర్కిటెక్చర్ బిటెక్‌లో చదవాల్సి ఉంటుందన్నారు. ఇదికాక పోస్టుగ్రాడ్యుయేష్‌కోర్సు(ఎంటెక్)లో రెండు కోర్సులు ఉంటాయి. అందులో ఒకటి నేవల్ ఆర్కిటెక్చర్‌తోపాటు డ్రెడ్జింగ్ టెక్నాలజీలో కోర్సులుంటాయని వారు వివరించారు.
గడిచిన యేడాది సింధియాలో నిర్వహిస్తున్న ఐఎంయు తరగతుల నుంచి ఫైనల్ ఇయర్ చదివిని వారు బయటికివెళ్ళిపోగా,పిజిలో 20 సీట్లు, బిటెక్‌లో (్ఫస్టియిర్)కు 40 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. దీంతో ఇటీవల నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు వచ్చిచేరారన్నారు. మొత్తం నాలుగేళ్ళ కోర్సులో ఐఎంయు తరగతులు ఉంటాయన్నారు. సెర్చిటెస్టింగ్ లేబ్‌లు, వసతి విస్తరణ కార్యక్రమాలు చేపడతారన్నారు.
ప్రస్తుతం సబ్బవరంలో నిర్మిస్తున్న ఐఎంయులో తగగతి గదులు,వర్క్‌షాప్ భవనాలు,విద్యుత్ సబ్‌స్టేషన్, వాడకం నీటిని రీ సైక్లింగ్‌చేసి మొక్కలకు తరలించే సూయజ్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్, వసతి గృహం, ఓవర్‌హెడ్ ట్యాంక్,ఇంటర్నల్‌రోడ్లు,ప్రహరీగోడలు పూర్తికావొచ్చాయన్నారు. అయితే గ్రౌండ్‌వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నట్లు నిర్థారణ కావటంతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూడాల్సి ఉందన్నారు.
గ్రామాభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేయాలి : ఎమ్మెల్యే అనిత
ఎస్. రాయవరం, జూన్ 15: గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కోరారు. గురువారం ఎస్. రాయవరం మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి కోట్ల రూపాయల విలువ చేసే రోడ్లతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఘన, వ్యర్ధ నిర్వహణ ప్లాంట్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం చేయడంలో పంచాయతీలదే కీలకపాత్ర అని ఆమె అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశంతో గ్రామాల అభివృద్ధికి కృషిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షులు వై. వినోద్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను వివరించారు.
సైతారుపేట గ్రామంలో చెరువులు పూడికమట్టి జిరాయితీ భూమిలో వేయడంతో భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆ గ్రామ సర్పంచ్ వీసం వెంకట లలిత సమావేశంలో చూపించగా ప్రతీ అంశాన్ని సర్పంచ్ రాజకీయం చేస్తున్నారంటూ వైస్ ఎంపీపి వాగ్వివాదానికి దిగడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఎంపీపి వై. వినోద్‌రాజు కలుగజేసుకుని వెంటనే సర్వే చేయించాల్సిందిగా తహశీల్దార్‌ను కోరడంతో రెండుమూడురోజుల్లో సర్వే జరిపిస్తామని తహశీల్దార్ చిరంజీవి పడాల్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. వ్యవసాయాధికారి ఉమాప్రసాద్ మాట్లాడుతూ విత్తనాల పంపిణీ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పడంతో పలువురు సర్పంచ్‌లు ఈ విధానాన్ని తప్పుబట్టారు. పశుగ్రాస క్షేత్రాలను వచ్చేనెల నుండి ఏర్పాటు చేసుకోవాలని పశుసంవర్ధక వైద్యులు రాజేష్ సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడివో డిడి స్వరూపారాణి, జెడ్పీటిసి బొట్టా లక్ష్మి, అటవీ శాఖాధికారి భాగ్యశ్రీ, ఆర్‌అండ్‌బి, విద్య, గృహనిర్మాణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.