విశాఖ

అభివృద్ధి, సంక్షేమం మా ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, సెప్టెంబర్ 21: ఇంటి తలుపు తట్టి పథకాలను అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే ఉందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవి ఆడిటోరియంలో మాజీ ఎం.ఎల్.ఎ. గవిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలన అందించడంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన చెప్పుకున్నారు. క్షమ శిక్షణకు మారుపేరైన ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 16 వేల కోట్లు రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు కనిపిస్తారని, తమ పార్టీ నాయకులు మాత్రం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటి బాట పడుతున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న మాడుగుల నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మాజీ ఎం.ఎల్.ఎ. గవిరెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. నిరంతరం ప్రజల సమక్షంలో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న గవిరెడ్డిని ఆయన అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలను సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విడనాడాలని శ్రీనివాసరావు హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ పల్లె ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తమ హయాంలోనే జరుగుతుందని, గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం వంటి పనులు తమ ప్రభుత్వమే చేపట్టిందని ఆమె చెప్పారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్.టి.ఆర్. స్థాపించిన దేశం పార్టీ ఆది నుంచి పేదల సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వారిని పక్కనపెట్టి అనర్హులకు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసారని ఆయన విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మాడుగుల నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్న తారకరామ జలాశయానికి ఎనిమిది కోట్ల 70 లక్షల రూపాయలను మంజూరు చేయించినట్టు ఆయన చెప్పారు. పాలగెడ్డ జలాశయానికి కూడా నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్టు ఆయన అన్నారు. వ్యవసాయానికి అవసరమైన చెరువుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్టు ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని రామానాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల, చీడికాడ, కోటపాడు ఎం.పి.పి.లు ఓండ్రు గంగమ్మ, కె.కళావతి, సబ్బవరపు పుష్పవతి, జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి, దేశం నాయకులు రెడ్టి సన్యాసినాయుడు, నందారపు సన్యాసిరావు, టి.కొండబాబు, పోతల రమణమ్మ, పుప్పాల అప్పలరాజు, గండి గోవింద్, గండి ముసిలినాయుడు, గండి శ్రీను, మజ్జి తాతబాబు, శ్రీనాధు మధు, కర్రి నాగమణి, ఎం.రామారావు తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ముగిసిన ఇంటింటికి దేశం
మాడుగుల, సెప్టెంబర్ 21: అధికార పార్టీ చేపట్టిన ఇంటింటికి దేశం కార్యక్రమం గురువారం మాడుగులలో నిర్వహించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే ఉద్ధేశ్యంతో తలపెట్టిన ఇంటింటికి దేశం ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు. నియోజకవర్గ కేంద్రం కావడంతో రోజంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అనకాపల్లి ఎం.పి. ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, మాజీ ఎం.ఎల్.ఎ. గవిరెడ్డి రామానాయుడుతో పాటు పలువురు దేశం నాయకులు మాడుగులలోని ప్రతి వీధిలో పర్యటించి ప్రజల సమస్యలు, ఇబ్బందులు గుర్తించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను వీరు స్వీకరించారు. విశాఖపట్నం నుంచి పాడేరు వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను మాడుగుల మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధిక శాతం మంది వినతులు సమర్పించారు. ప్రజల నుంచి సమస్యలపై వచ్చిన వినతులకు స్పందించిన నేతలు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాడుగులలో డ్రైనేజి సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్న నేతలు డ్రైనేజిని నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వీధులలో పర్యటించిన నేతలకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.