విశాఖ

పోటాపోటీగా ప్రజల ముంగిటకు వెళుతున్న దేశం, వైకాపా నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, సెప్టెంబర్ 25: సాదారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు గడచిన పక్షం రోజులుగా ప్రజల ముంగిటకు వెళ్లేందుకు తమ పార్టీ రూపొందించిన ఈ కార్యక్రమాల పేరిట పోటీపడుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగానే గ్రామాల్లో ఒకేసారి రాజకీయ సందడి నెలకొంది. ఇంటింటికీ తెలుగుదేశం పేరిట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్రజలకు జరిగిన అభివృద్ధిని వారి ముంగిటకు స్వయంగా వెళ్లి వివరించడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంలో దేశం నేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 11న ప్రారంభమైన ఇంటింటికీ దేశం కార్యక్రమం జిల్లాలోన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోను, సంబంధిత ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జిల నేతృత్వంలో ఎంతో ఆర్భాటంగాను, ప్రచార పటోటాలతోను ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో సాగుతోంది. మరోవైపు ఫ్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ సిపి నేతలు సైతం నైరాశ్యాన్ని పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్నాలు పథకం ఆవశ్యకతను ఇంటింటికీ వెళ్లి ఫ్రజలకు తెలియజేసేందుకు కూడా ఇప్పుడే కార్యక్రమాలను రూపొందించారు. దీంతో అటు అధికార తెలుగుదేశం పార్టీ ఇంటింటా తెలుగుదేశం పేరిట, ఇటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ సిపి నవరత్నాలు, వైఎస్సాఆర్ కుటుంబం కార్యక్రమాలు పేరిట ప్రజల ముంగిటకు వెళ్లడంలో పోటీపడుతున్నారు. దీంతో పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. సాదారణంగా 2019 ఏప్రిల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఇంకా 20నెలల సమయముంది. కానీ కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాల వలన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని గత ఆరునెలలకు ముందే వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలియజేసి క్యాడర్‌ను తనదైన పంధాలో సన్నద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటింటికీ దేశం పేరిట ప్రజల వద్దకు వెళ్లాలని, ఈ సంధర్బంగా మీ పనితీరును బేరీజు వేస్తామని తమ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు తరచూ సమీక్షలు జరిపి ఖరాఖండిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. జిల్లామంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు తమ నియోజకవర్గాల్లోనే కాక ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఇంటింటా దేశం కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు యలమంచిలి పట్టణంలో జరిగిన ఇంటింటికీ దేశం కార్యక్రమంలో పాల్గొనగా మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాడుగుల, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అడపాదడపా ఇంటింటికీ దేశం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సైతం జిల్లాలో జరిగే ఇంటింటా దేశం కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడే సమీక్ష జరుపుతున్నారు. పరవాడ మండల పరిధిలో జరిగిన ఇంటింటికీ దేశం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం పర్యటించేందుకు వచ్చేందుకు సోమవారం తనను కలిసిన ఇక్కడి నియోజకవర్గ నేతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనకాపల్లి, మాడుగుల, చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇంటింటికీ దేశం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలావుంటే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ తాను ఇన్‌చార్జిగా వ్యవహరించే అనకాపల్లి అసెంబ్లీతోపాటు జిల్లావ్యాప్తంగా కూడా పర్యటన జరిపి నవరత్నాలు కార్యక్రమ ఆవశ్యకతపై ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేసే బాధ్యతను చేపట్టడంపై బూత్ కమిటీ కన్వీనర్లను సన్నద్దం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షులు అమర్ అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల తదితర నియోజకవర్గాల్లో ఇంతవరకు పర్యటించి వైఎస్సాఆర్ కుటుంబం, నవరత్నాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఎన్నికల వాతావరణాన్ని తలపించే రీతిలో అటు దేశం, ఇటు వైకాపా నేతలు ప్రజల ముంగిటకు వెళ్లడంలో పోటీపడుతున్నారు.