విశాఖ

విశాఖ డెయిరీ రైతులదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, సెప్టెంబర్ 25: విశాఖ డెయిరీ రైతుల ఆస్తి అని దాన్ని అభివృద్థిచేసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందని ఆ సంస్థ సిఇవో ఆడారి ఆనంద్‌కుమార్ అన్నారు. మండలంలోని చిన వంగలి గ్రామంలో సుమారు 14 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పాలసొసైటీ భవనాన్ని ఆయన సోమవారం ఎమ్మెల్యే బండారుసత్యనారాయణమూర్తితోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా బోనస్‌గా మండలంలో రైతులకు 1.10కోట్లరూపాయలను పంపిణీ చేస్తున్నామన్నారు. 2.75 లక్షల కుటుంబాలు విశాఖ డెయిరీ పై ఆధారపడి జీవించటం అభినందనీయమన్నారు. విశాఖ డెయిరీని అభివృద్థి చేయటంలో ఆసంస్థ చైర్మన్ ఆడారి తులసీరావు రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అయితే డెయిరీ అభివృద్థిచెందాలంటే రైతులు పాల ఉత్పత్తిని ఇంకా పెంచాల్సి ఉందన్నారు. ఇక్కడి సొసైటీ 30 లక్షల రూపాయల లాభాల్లో ఉన్నందున అది రైతుల అభివృద్థికే ఖర్చుచేస్తామన్నారు. అంతకుముందు చినవంగలిలో అంగన్‌వాడీ కేంద్రానికి ఉచితంగా ముదపాక రామ్మూర్తిసన్యాసమ్మల కుటుంబసభ్యులు

ఉచితంగా దానం చేసిన స్థలంలో నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పెదవంగలి గ్రామాల్లో 11 లక్షల రూపాయల చొప్పున నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను,తెలికలపాలెంలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. 3.3సంవత్సరాల అధికారం తర్వాత ప్రజలకు అన్నిరకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఆయన నెలవారీ అందించే పింఛన్లతోపాటు మహిళలకు దీపం పథకం పేరుతో ఉచిత గ్యాస్ స్టౌవ్‌లను పంపిణీ చేయగా కాంగ్రెస్ దీపం ఆర్పేసిందని చమత్కరించారు. పెందుర్తినియోజకవర్గంలో 7వేల పక్కాగృహాలు నిర్మిస్తున్నామన్నారు.
రేషన్‌కార్డులు,పింఛన్లు,వికలాంగులకు పింఛను పెంపు,వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నామన్నారు. పథకాల సంక్షేమం పాటు పడుతున్నామన్నారు. ఆకార్యక్రమంలో ఆగ్రామ పార్టీనేతలు సర్పంచు వేపాడ సోమునాయుడు,పొట్నూరు అప్పారావు,పాలసొసైటీ జెట్టిముత్యాలనాయుడు,ఆకుల గణేశ్,జెట్టినర్సింగరావు, జిల్లాపార్టీనేతలు గవర అప్పారావు,తమరాన బంగారునాయుడు,అంగటినానాజీ,,మండల టిడిపి అధ్యక్ష్యకార్యదర్శులు మిడతాడ మహలక్ష్మినాయుడు,కోరాడ శ్రీను, బుచ్చిరాజు,దొడ్డి ప్రకాశ్, ఆర్‌డబ్లూఎస్ డిఇ పల్లంరాజు,మండల ఇంజినీర్ చిట్టిబాబు,ఐసిడిఎస్ సిడిపివో శ్రీ గౌరిలు పాల్గొన్నారు.

గూడెం కొత్తవీధిలో ఎడతెరిపి లేని వర్షం

గూడెంకొత్తవీధి, సెప్టెంబర్ 25: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో సోమవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. 11 గంటలకు మొదలైన వర్షం క్షణం కూడా తెరిపివ్వకుండా కురియడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గూడెం, ఆర్.వి.నగర్ వారపు సంత కావడంతో మారుమూల ప్రాంతాల నుండి వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటవీ , వ్యవసాయ ఉత్పత్తులు క్రయవిక్రయాలకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వ్యాపారులకు భారీ వర్షం వలన సామాన్లుకు తీవ్రంగా నష్టంవాటిల్లింది. మారుమూల ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు వాగులను దాటేందుకు నానా అవస్థలు పడ్డారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో కురిసిన వర్షం కారణంగా జనాలు హోటళ్ళలో, కిరాణా దుకాణాల్లో తలదాచుకునే పరిస్థితి నెలకొంది.