విశాఖ

‘సైకిల్’ ఎక్కనున్న ఎమ్మెల్యే కిడారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అరకులోయ, ఏప్రిల్ 24: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అధికార టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 29 మధ్య సైకిల్ ఎక్కెందుకు సర్వేశ్వరరావు దాదాపు నిర్ణయించుకున్నట్టు సమాచారం. టిడిపిలో చేరేముందు ఈ నెల 25 లేదా 26న కిడారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ తరువాతే టిడిపిలో చేరుతారని సమాచారం. సర్వేశ్వరరావు టిడిపిలో చేరనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆయన రాజకీయ గురువైన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ నిర్ణయంపై ఇంతవరకు వేచి చూశారని చెబుతున్నారు. కొణతాల అడుగుజాడల్లో నడుస్తున్న కిడారి తన రాజకీయ భవిష్యత్తును ఆయన చేతుల్లో ఉంచి కొణతాల ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మొదట భావించినట్టు అంటున్నారు. అయితే కొణతాల కూడా టిడిపిలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఆయన శిష్యులుగా ఉన్న గండి బాబ్జి, కిడారి సర్వేశ్వరరావు తమ రాజకీయ భవిష్యత్తును తామే తీర్దిదిద్దుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో గండి బాబ్జికొణతాలను కాదని టిడిపిలో చేరేందుకు సిద్ధపడడంతో కిడారి కూడా ఆయన బాటలోనే నడవాలనే నిర్ణయానికి వచ్చి టిడిపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు కిడారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇదిలాఉండగా టిడిపిలో చేరేందుకు ముందునుంచి సుముఖంగా ఉన్న కిడారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఆశించినట్టుగా చెబుతున్నారు. అయితే మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి వర్గం నుంచి స్పష్టమైన వైఖరి వెలువడడంతో కనీసం గిరిజన సహకార సంస్థ (జిసిసి) చైర్మన్ పదవినైనా తనకు కట్టబెట్టాలని కోరినట్టు సమాచారం. జిసిసి చైర్మన్ పదవిని కిడారికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వర్గం నుంచి హామీ లభించినప్పటికీ దీనికి కూడా కొంత వ్యవధి పడుతుందని చెప్పినట్టు తెలిసింది. అయితే టిడిపిలో ఏలాగైనా చేరేందుకు సిద్ధపడిన కిడారి జిసిసి చైర్మన్ పదవి ఏదో ఒక సమయంలో వస్తుందనే విశ్వాసంతో సైకిల్ ఎక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టిడిపిలో చేరుతున్న విషయమై కిడారితో ‘ఆంధ్రభూమి’ ప్రస్తావించగా ప్రస్తుతానికి అదేమీ లేదంటూ చెప్పడం విశేషం. విశాఖ రైల్వే జోన్ కోసం వైకాపా నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష, ఇటీవల వైకాపా నాయకులు విశాఖ నగరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన వంటి కార్యక్రమాలకు కిడారి గైర్హాజరు కావడాన్ని ప్రస్తావించగా తనకు పార్టీ నుంచి సరైన సమాచారం లేదని చెప్పారు. అంతేకాకుండా వైకాపా గురించి మాట్లాడదలచుకోలేదని కిడారి స్పష్టం చేయడం ఈ సందర్భంగా గమనార్హం.