విశాఖ

గిరిజనుల అబివృద్ధిని అడ్డుకోవడమేనా మావోయిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 12: దారకొండలో సెల్ టవర్ ఫ్యానల్ బోర్డును మావోయిస్టులు దగ్దం చేయడంపై చింతపల్లి డి ఎస్పీ అనిల్ పులిపాటి తీవ్రంగా స్పందించారు. ఈసందర్భంగా గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల కోసమే పాటుపడుతున్నామని చెప్పుకునే మావోలు ప్రజా సంపద, ఆస్తులను ధ్వంసం చేయడమేనా అని ప్రశ్నించారు. దారకొండలో ప్రజల మద్దతు మావోయిస్టులు కోల్పోయారని , తిరిగి మద్దతు పొందాలంటే మంచితనంగా పట్టు సంపాదించుకోలేపోయారన్నారు. అందుకే ఇటువంటి సంఘటనల పాల్పడి భయాందోళనకు గురి చేస్తే గిరిజనులు తమ వైపు ఉంటారనే ఆలోచనతో మావోయిస్టులు ఇటువంటి సంఘటనలకు పాల్పడి ఉంటారన్నారు. సెల్‌టవర్ సామగ్రి దగ్ధం చేయడం వలన సమాచార వ్యవస్థ దారకొండతో పాటు పరిసర గ్రామాల గిరిజనులు పొందలేకుండా పోయారన్నారు. దీనిని ప్రతీ ఒక్క గిరిజనుడు గమనిస్తున్నారన్నారు. సెల్ టవర్ ఫ్యానెల్ బోర్డు కాల్చిన ఘటనలో 60 మంది మావోయిస్టులని, ఇందులో 30 మంది ఆయుధాలు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుండి 30 మంది గుత్తికోయలను తీసుకువచ్చి వారి ఉనికిని చాటి చెప్పుకునే ప్రయత్నం చేసారన్నారు. ఈఘటన కోరుకొండ దళం ఏరియా కమిటీ నెంబర్ నవీన్ నేతృత్వంలో జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. బి. ఎస్. ఎన్. ఎల్. టవర్ ఫ్యానల్ బోర్డులు పునరుద్దరించేందుకు అధికారులతో చర్చించామని , త్వరలో బి. ఎస్. ఎన్. ఎల్. సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈఘటనలో బి. ఎస్. ఎన్. ఎల్. అధికారులు సీలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.