విశాఖ

పోలీసులు అప్రమత్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 22: మావోయిస్టులు ఎ. ఓ.బి.లో వరుస సంఘటనలకు పాల్పడుతుండంతో పోలీసులు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. ఈనేపధ్యంలోనే పోలీసులు అప్రమత్తమై అనువణువునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 12న మావోయిస్టులు దారకొండలో సెల్‌టవర్ సామగ్రి దగ్ధం చేసిన రెండు రోజుల వ్యవధిలోనే చింతపల్లి మండలం కోరుకొండ వద్ద అన్నవరం గ్రామానికి చెందిన వ్యాపారి బంకులోవ ను హతమార్చి తమ ఉనికి చాటుకున్నారు. ఇదే తరహాలో ఆదివారం ఉదయం చిత్రకొండ లాంచీఘాట్ వద్ద పట్టపగలే ఐదుగురు మావోయిస్టులు వచ్చి పాంగి సోమాను హతమార్చడంతో పోలీసులు కలవర పాటుకు గురయ్యారు. వరుస సంఘటనలకు మావోలు పాల్పడుతుండడంతో ఎఓబిలో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.

అవుట్‌పోస్టులకు నిత్యావసరాల తరలింపు
సీలేరు, అక్టోబర్ 22: ఇటీవల మావోయిస్టులు లాంఛీలో పోలీసులకు నిత్యావసర సరుకులు తరలిస్తుండగా మావోయిస్టులు లాంచీని అదుపులోకి తీసుకుని నిత్యావసర సరుకులు మావోయిస్టులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను ప్రాణాలతో విడిచిపెట్టారు. దీంతో పోలీసులు వారి పంధాను మార్చి ఒడిషా కాటాప్ ఏరియాల్లో అవుట్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ రిజర్వ్డ్ బెటాలియన్‌కు ఆదివారం ఉదయం హెలికాప్టర్‌లో నిత్యావసర సరుకులు తరలించారు. చిత్రకొండ కటాప్ ఏరియాల్లో ఉన్న అవుట్ పోస్టులకు నిత్యావసర సరుకులు వెళ్ళే సదుపాయం లేకపోవడంతో ఉన్నతాధికారులు హెలికాప్టర్‌లో సామగ్రి తరలించారు. బలిమెల నుంచి లాంచీలో సరుకులు తరలిస్తే మావోయిస్టుల నుంచి ముప్పు వాటిల్లుతుందని కుంటూరుపొదర్‌లో ఉన్న ఆర్.బి. ఐ. పోలీసులకు నిత్యావసర సరుకులు అందించారు.