విశాఖ

రైతు సంఘాలకు రివాల్వింగ్ ఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 23: మండలంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ టి.రాజుబాబు గురువారం రివాల్వింగ్ ఫండ్ అందచేసారు. మండల పరిధిలోని పద్నాలుగు పంచాయతీల్లో 129 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉండగా, వాటిలో 54 సంఘాలకు ఐదు లక్షల 40 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసారు. ఒక్కొక్క సంఘానికి పది వేల రూపాయల వంతున రివాల్వింగ్ ఫండ్‌ను అందచేసారు. రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంజూరు చేసిన నిధులను సంఘాలకు పంపిణీ చేసి కాయగూరలను విస్తారంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. అంతకుముందు స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయ భవనంలో గిరిజన రైతులతో సమావేశమై రివాల్వింగ్ ఫండ్ వినియోగంపై అవగాహన కల్పించారు. మిగిలిన 75 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ త్వరలో రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో అరకులోయ మండలంలోనే మొదటి సారిగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వెలుగు, మండల మహిలా సమాఖ్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.