విశాఖ

గీతం వేధికగా అఖిల భారత స్థాయి టెన్నిస్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 23: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యానివర్సిటీస్ పర్యవేక్షణలో జరిగే అంతర విశ్వవిద్యాలయాల మహిళ టెన్నిస్ టోర్నమెంట్‌కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆతిధ్యం ఇవ్వనుందని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. జనవరి 6వ తేదీ నుంచి 8 వరకు అఖిల భారత స్థాయిలో దేశంలోని వివిద విశ్వవిద్యాలయాలకు మహిళా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ టోర్నమెంట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఫిక్సర్ల సమాచారాన్ని గీతం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎడ్యు నుంచి పొందవచ్చన్నారు.
జినోమిక్స్ బయోటిక్ సిఇఓ గీతం సందర్శన
విశాఖపట్నం, నవంబర్ 23: జీవ శాస్త్ర పరిశోధనలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన జినోమిక్స్ బయోటెక్ (యుఎస్‌ఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, సిఇఓ డాక్టర్ రత్నగిరి పోలవరపు గురువారం గీతం ఓమ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాడి పరిశ్రమలో పశువులకు వ్యాధుల సోకకుండా బయోటెక్నాలజీ రంగంలో అభివృద్ధి చేస్తున్న వివిద రకాల మందుల ఇతర రక్షణ అవసరాలను వివరించారు. బయోటెక్నాలజీ రంగం భవిష్యత్‌లో రైతుల ఆదాయ మార్గాలను పెంచేందుకు పరిశోదనలు విస్తృతం చేస్తోందన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ పరిశోదకులు చేస్తున్న అధ్యయనాలను ప్రశంసించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యుసిజి వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సి.హెచ్.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గీతంను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపిక చేసిందన్నారు. బయోటెక్నాలజీ రంగంలో నూతన అధ్యయనాలకు జినోమిక్స్ బయోటెక్ వంటి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. దీనికిగాను అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆసక్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డాక్టర్త రత్నగిరి పోలవరపును యుజిసి వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సి.హెచ్.రామకృష్ణ సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

గీతంలో 24 నుండి సిఎస్‌ఐ విద్యార్ధి విభాగం
* రాష్ట్ర సమావేశాలు
విశాఖపట్నం, నవంబర్ 23: కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్‌ఐ) గీతం విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 24, 25 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్టు సిఎస్‌ఐ రాష్ట్ర విద్యార్ధి విభాగం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.ఇ.ఎస్ కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి దాదాపు రెండు వేల మందికి పైగా విద్యార్ధి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారన్నారు. ఎంబ్రేసింగ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పేరిట ఈ ఏడాది సమావేశాలను నిర్వహిస్తున్నామని సమావేశాల్లో భాగంగా నిపుణుల పర్యవేక్షణలో సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్సువల్ రియాలిటీ అనే అంశాలపై వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని అలాగే కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంపై క్విజ్ పోటీలను,సాంకేతిక చర్చలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాలను కంట్రోల్ ఎస్ సంస్థ డైరెక్టర్ ఆర్.ఎస్ ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గీతం.ఎడ్యు/సిఎస్‌ఐకనె్వన్షన్ ద్వారా పేర్లను నమోదు చేయించుకోవచ్చునన్నారు.