విశాఖ

ఈశ్వరిని వదులుకుంటే స్వయంకృతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాఖపట్నం, 23: ఆమె నిబద్ధత కలిగిన ఎమ్మెల్యే. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ధనార్జనే ధ్యేయంగా మనుగడ సాగిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలకు భిన్నంగా సొంత డబ్బును ఖర్చు చేసుకుంటూ, అప్పులుపాలైనా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహరహం పనిచేస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకులు కత్తికట్టినట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో వైకాపా గెలుచుకునే మొట్టమొదటి స్థానం ఏది అని అడిగితే, పాడేరు పేరే రాజకీయ విశే్లషకులు చెపుతారు. నియోజకవర్గంలో పట్టు సాధించిన గిడ్డి ఈశ్వరి, అదే పార్టీలో నేడు గడ్డు పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది? పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఓపక్క పాద యాత్ర చేస్తుంటే, ఉన్న ఎమ్మెల్యేలను చేజార్చుకుంటూ, విజయావకాలకు దూరంగా పార్టీని నెట్టేసే వ్యవహారాలు మరోపక్క జరుగుతున్నాయి. మైండ్ గేమ్‌తో ఈశ్వరి వంటి నిఖార్సన నాయకురాలిని పార్టీ నుంచి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న కుట్రను అధిష్టానం పట్టించుకోపోవడం నిజంగా దారుణం.
గిడ్డి ఈశ్వరి పేరు చెపితే, పాడేరు నియోజకవర్గంలో అవినీతి అధికారులు భయపడతారు. ప్రజలు బ్రహ్మరథం పడతారు. సామాన్య టీచర్‌గా పనిచేస్తున్న ఆమె అనూహ్య పరిణామాల మధ్య రాజకీయాల్లోకి వచ్చి, వైకాపాలో చేరి, పాడేరు నియోజకవర్గంలో అప్పటి వరకూ ఎవ్వరూ సాధించలేనంత మెజార్టీతో ఈశ్వరి విజయం సాధించారు. పాడేరు నియోజకవర్గంలో ఏ అధికారీ, ఏ ప్రజా నాయకుడు వెళ్లని మారుమూల గ్రామాలకు ఈశ్వరి వెళ్లారు. నియోజకవర్గంలో 100కు పైగా పంచాయతీల్లో ఆమె పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలపై ఆమె గళమెత్తడం వలనే, ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ఈశ్వరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే, పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎదిగే అవకాశం లేదని భావించిన చంద్రబాబు ఆమెను టిడిపిలోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. టిడిపిలో ఓ ముఖ్య నాయకుడి అనుచరులు పాడేరులో వారం, పది రోజులు తిష్టవేసి ఈశ్వరిని టిడిపిలోకి తీసుకు రావడానికి కసరత్తు చేశారు. కానీ ఆమె ససేమిరా అన్నారు. ఆఖరికి ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆ వత్తిడులకే ఈశ్వరి తలొగ్గి ఉంటే, ఆమె జీవితం ఓ మలుపు తిరిగేది. కానీ ఈశ్వరి వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలిపెట్టారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి, తెలుగుదేశం పార్టీకి మొగ్గుచూపిన అరకు ఎంపి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా ఈశ్వరి చేసిన పోరాటాన్ని పార్టీ అధిష్టానం మరిచిపోతే, అది కృతఘ్నతే అవుతుంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎదగలేదు. కానీ ఈశ్వరి తన నియోజకవర్గంలో పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేశారు. రానున్న ఏ ఎన్నికలోనైనా పాడేరు నియోజకవర్గంలో వైకాపా విజయ ఢంకా మోగించేవిధంగా పార్టీని పటిష్టం చేశారు. ఇంతగా కష్టపడ్డ ఈశ్వరిని పార్టీ నుంచి గెంటేసేందుకు ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి?
ఏజెన్సీలో మంచి పట్టున్న ఈశ్వరి, కుంభా రవిబాబు రాకను వ్యతిరేకిస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. రవిబాబు పార్టీలోకి వస్తే అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. కానీ ఇప్పటికే ఫల్గుణుడిని నియోజకవర్గ సమన్వయకర్తగా జగనే స్వయంగా నియమించారు. పెద్ద ఎత్తున వచ్చే జీతాన్ని కూడా వదులుకుని ఫల్గుణుడు వైకాపాలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆయనదేనని జగన్ భరోసా ఇవ్వడంతో పార్టీ పటిష్టతకు ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. జగన్ ఇచ్చిన మాట తప్పి రవిబాబుకు అరకు టిక్కెట్ ఇస్తే, ఫల్గుణుడి పరిస్థితి ఏమవుతుంది. ఈ విషయానే్న ఈశ్వరి ప్రశ్నిస్తున్నారు.
మైదాన నాయకులకు ఏంటి సంబంధం?
ఏజెన్సీలోని పార్టీ వ్యవహారాల్లో మైదాన ప్రాంత వైకాపా నాయకులు ఎందుకు తలదూర్చుతున్నారు? రవిబాబుకు బాసటగా విశాఖ నగరానికి చెందిన ఇద్దరు నాయకులు ఎందుకు నిలబడ్డారు? జగన్‌కు నమ్మిన బంటుగా పనిచేస్తున్న ఈశ్వరిని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు వీరు మైండ్‌గేమ్ ఆడుతున్నట్టు స్వపక్షీయులే చెపుతున్నారు. గెలిచే నియోజకవర్గాల్లో చిచ్చు రగిల్చి, పార్టీని మరింతగా అణగదొక్కడే వీరి ప్రయత్నమా? అని పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వీరి ప్రవర్తనకు ఈశ్వరి మనస్తాపం చెందారు. ఈ వ్యవహారాన్ని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి దృష్టికి ఈశ్వరి తీసుకువెళ్లారు. అయినా, అధిష్టానం ఆమె రోదన, వేదనను పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.
27న రాజీనామా చేస్తారంటూ ప్రచారం
ఈశ్వరిని బయటకు పంపించి, రవిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నాయకులు గురువారం మరో అడుగు ముందుకు వేసి, గిడ్డి ఈశ్వరి ఈనెల 27న పార్టీకి రాజీనామా చేస్తారన్న కథనాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ క్రీడను జగన్ అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. పార్టీకి ఫండ్ ఎంత అవసరమో, పార్టీలో నిబద్ధతతో పనిచేసే వారు కూడా అంతే అవసరమన్న విషయాన్ని జగన్ గుర్తించాల్సి ఉంది. ఒకవేళ ఈశ్వరిని వదులుకుంటే, పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని ఆ పార్టీలోని వారే చెపుతున్నారు.

అట్టహాసంగా గణబాబు కుమార్తె వివాహం
ఎమ్మెల్యే గణబాబు కుమార్తె లక్ష్మీ శ్రీజసింహాకు, హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌తో వివాహం గురువారం ఘనంగా జరిగింది. స్థానిక సిఐఐ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వివాహా వేడుకకు మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడుతోపాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని భావించారు. అయితే, బెంగళూరులో వేరే వివాహ వేడుకకు ఆయన హాజరవడంతో సమయా భావం వలన ఇక్కడికి రాలేకపోయారు.