విశాఖ

భారీ వర్షంతో చల్లబడిన గూడెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 28: విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. వేడితో అల్లాడుతున్న ప్రజలు ఎంతో ఉపశమనం చెందారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన ఉద్యానవన పంటలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గురువారం కురిసిన ఈవర్షం వలన సంతకు వచ్చిన ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో సరుకులు పెట్టుకునేందుకు ఎటువంటి నీడ లేకపోవడంతో నానా యాతన పడ్డారు. క్రయవిక్రయాలు కూడా చేసుకోవడానికి వీల్లేకుండా సుమారు గంటకుపైగా భారీ వర్షం కురిసింది. వర్షం వలన వేసవి ఉపశమనం పొందడమే కాకుండా వ్యవసాయానికి ఎంతో అనుకూలించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.