విశాఖ

దేవుడా... నీదే భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: నగరంలో గత అయిదు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎంసెట్ అభ్యర్థులకు దేవుడే దిక్కు మాదిరిగా పరిస్థితి తయారైంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం మినహా, అంతరాయం కలిగితే ఏం చేయాలన్న దానిపై ఆదేశాలు లేకపోవడం గమనార్హం. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు జిల్లాలో 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌కు సంబంధించి 33 కేంద్రాలను, మెడిసిన్‌కు సంబంధించి 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌కు 18,079 మంది, మెడిసిన్‌కు 7518 మంది హాజరవుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఐదు రోజులుగా వివిధ కారణాలతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. ఒక పక్క మండుతున్న ఎండలు, మరో పక్క విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో జనం ఇబ్బందులు పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఎంసెట్ జరుగుతున్న కేంద్రాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలో నెలకొన్న పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల ఏర్పాటుపై ఆదేశాలు లేవు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఉక్కపోతలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొవ్వొత్తులు, జనరేటర్ల ఏర్పాటు వంటి వాటిపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడం గమనార్హం. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే జనరేటర్ల వినియోగంపై తమకు ఎటువంటి ఆదేశాలు లేవని ఎంసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.సుబ్రహ్మణ్యం తెలిపారు. నిరంతర సరఫరాకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జిల్లాలో వివిధ కేంద్రాల్లో శుక్రవారం జరుగనున్న ఎంసెట్ నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతించరని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని రీజినల్ కన్వీనర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎండ నుంచి రక్షించుకునేందుకు అభ్యర్థులు, తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.