విశాఖ

పెదలబుడు అభివృద్ధిపై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 28: ప్రభుత్వ అధికారుల పనితీరుపై పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి (ఐటిడిఎ పిఒ) ఎం.హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత గ్రామం పెదలబుడు లో అభివృద్ధి పనులపై గురువారం నిర్వహించిన సమీక్షా స మావేశంలో పిఓ అధికారులపై మండిపడ్డారు. అప్పగించిన ప నులు బాధ్యతాయుతంగా పూర్తి చేయకుండా కుంటి సాకు లు చెప్పి తప్పించుకు తిరుగుతున్న అధికారులను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తూ అభివృద్ధి ఫలాలు అర్హులైన గిరిజనులకు అందకుండా చేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, గృహ నిర్మాణ సంస్థ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అధికారులు పనితీరు, పద్ధతి మార్చుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, లేనిపక్షంలో చర్యకు బాధ్యులు కాక తప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజనాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఉద్యోగి పనిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని ఐ.టిడిఎ ప్రాజెక్టు అధికారి ఆదేశించారు.
సి.ఎం. దత్తత పం చాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని గడువులోగా పూర్తి చేయాల్సిందేనని ఆయన అన్నారు. గ్రామాలన్నింటిలో రహదారి, తాగు, సాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, శిధిలావస్థకు చేరిన పంచాయతీ భవనాన్ని వెంటనే మరమ్మతులు చేయించాలని, సామాజిక భవనం, అంగన్‌వాడీ కేంద్రం, వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెదలబుడు ముఖద్వారంలోని దొబటొంట్ గెడ్డపై వంతెన నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని, అర్హులైన గిరిజనులకు పక్కా గృహాలు, రేషన్ కార్డులు, రుణాలు, భూసార ఆరోగ్య కార్డులు, గొర్రెలు, మేకలు, గ్యాస్ సిలెండర్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు.
గ్రామాల్లో ప్రతి ఇంటి ఎదుట ఇంకుడు గోతులు తవ్వించాలన్నారు. గిరిజనుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని, అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఎదురైన సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రాజెక్టు అధికారి హరినారాయణన్ పేర్కొన్నారు. సమావేశంలో పాడేరు ప్రాజెక్టు ఉద్యానవన శాఖ అధికారి చిట్టిబాబు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంప్రసాద్, గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్, ఎంపిడిఒ మల్లికార్జునరావు, తహశీల్దార్ నాగభూషణరావు, జి.సి.సి. మేనేజర్ పోతల సింహాద్రప్పడు, ఐ.సి.డిఎస్ పిఒ. ఉమ, ఆర్.డబ్ల్యు.ఎస్. డిఇఇ సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి శెట్టి సుందరరావు, ఉపాధిహామీ పథకం అధికారిణి భ్రమరాంబ, హౌసింగ్ డి.ఇ. ఉమామహేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎ.ఇ. భాస్కరరావు, పెదలబుడు సర్పంచ్ సమర్డి గులాబి, ఇ.ఒ. అచ్యుతరావు, వైద్య ఆరోగ్య శాఖ సూ పర్ వైజర్లు పాల్గొన్నారు.