విశాఖ

మళ్లీ రోడ్డెక్కిన ‘బ్రాండిక్స్’ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, ఏప్రిల్ 28: బ్రాం డిక్స్ మహిళా కార్మికులు మళ్లీ ఉద్యమబాట పట్టారు. బ్రాండిక్స్-3కి చెందిన 900 మంది ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ మెయిన్‌గేటు ముందు గురువారం ధర్నాకు దిగారు. ఎ-షిప్ట్‌కు వచ్చిన ఉద్యోగులు ఉదయం 6గంటల నుండి గేటు వద్ద ఆందోళన చేపట్టారు. జీతాలతోపాటు పిఎఫ్‌లు చెల్లించాలని, సూపర్‌వైజర్ల వేధింపులు ఆపాలని కోరుతూ పాత పద్ధతిలో ధర్నాకు దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు యాజమాన్యంతో కుమ్మక్కై ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉ ద్యమం కొనసాగిస్తామన్నారు. కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. దీంతో ఉలిక్కిపడిన యాజమాన్యం దిగివచ్చి ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఇచ్చిన హామీలను అమలుకి సిద్ధంగా ఉన్నట్టు యాజమాన్యం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ విధానం రద్దు చేసిందని, జీతాల పె ంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో ప్రకారం చెల్లించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వివరించారు. సూపర్‌వైజర్ల వేధింపులు ఇక ఉండబోవన్నారు. క్యాంటిన్ సమస్యలను మెరుగుపరుస్తామన్నారు. 15వ తేదీన ధర్నా చేసిన ఉద్యోగులంతా 28వతేదీ లోగా విధులకు హాజరైనట్లైతే పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తామని, తరువాత విధులకు వచ్చే వారికి జీతా లు చెల్లించేది లేదని యాజమాన్యం తెలియజేసింది. యాజమాన్యం హా మీలతో కార్మికులు మళ్లీ విధులకు హాజరయ్యారు.