విశాఖ

ఎమ్మెల్యే పీలా దైవ భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 11: అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లోని దాదాపు 25 దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో సాంప్రదాయబద్దంగా మంచి విశిష్టతతో కూడిన విగ్రహాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా సమకూర్చాలని ఎమ్మెల్యే పీలా సంకల్పించారు. స్థానిక వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావుతోపాటుగా తిరుమల వెళ్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న వివిధ దేవతామూర్తుల విగ్రహాలను పరిశీలించారు. లక్ష రూపాయల విలువైన విగ్రహానికి సంబంధిత దేవాలయం నిర్వాహకులు 25వేల మొత్తం చెల్లిస్తే సంబంధిత విగ్రహాలను దేవాదాయ శాఖ సమకూరుస్తుంది. 25దేవాలయాల వివరాలు, అక్కడ కావాల్సిన దేవతామూర్తుల విగ్రహాల సమాచారాన్ని దేవాదాయ శాఖాధికారులకు అందజేసారు. సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో టీటిడి ఆధ్వర్యంలో విశాఖ తరహాలో సమాచార కేంద్రం ఏర్పాటు విషయమై సంబంధిత టీటిడి జెఇవో పోలా భాస్కర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలోని స్థలం ఇస్తే కల్యాణ మండపంతోపాటు టీటిడి ఆధ్వర్యంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జెఇవో పోలా భాస్కర్ హామీ ఇచ్చారు.

13న దిశ సమీక్షా సమావేశం
* 23న జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం * కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం, డిసెంబర్ 11: ఈ నెల 13వ తేదీన అరకు పార్లమెంటు సభ్యురాలు అధ్యక్షతన ‘దిశ’ సమీక్షా సమావేశం నిర్వహించబడుతుందని సంబంధిత అధికారులు తమ శాఖల నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను కోరారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులను సమీక్ష సమావేశాలపై ఆదేశాలిచ్చారు. ఈ నెల 23వన కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించబడుతుందని, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమతమ శాఖల నివేదికలతోరావాలని, ముందు తాను ఒకసారి శాఖలవారీగా సమీక్షిస్తానన్నారు. ప్రధాన శాఖలు తమ శాఖల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని జిల్లా ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలన్నారు.