విశాఖ

వడదెబ్బకు ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఏప్రిల్ 28: మండలంలోని చాకిపల్లి గ్రామానికి చెందిన వృద్దుడు వడదెబ్బకు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంటా అప్పలనాయుడు పొలంలో పనులు ముగించుకుని ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసేలోగా మృతి చెందాడు. దీంతో వేసవిలో ఇప్పటివరకు మండలంలో వడదెబ్బకు మరణించిన వారి సంఖ్య 4కు చేరుకుంది.
లక్కవరంలో మరొకరి మృతి
చోడవరం : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన చలుగు అప్పలనాయుడు (73) పొలం నుండి పశువులను తీసుకువచ్చి కుప్పకూలిపోయాడు. అతడిని చోడవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించిన అనంతరం ఆయన ఇంటివద్ద వడదెబ్బకు గురై మృతి చెందాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.