విశాఖ

‘కిడారి’కి గిరిజనులే బుద్ధి చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావుకు గిరిజనులు తగిన బుద్ధి చె బుతారని అరకులోయ ఎం.పి.పి. కె. అరుణకుమారి, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ సమర్డి గులాబి, వైకాపా నాయకులు శెట్టి అప్పాలు, స మర్డి రఘునాధ్ పేర్కొన్నారు. వైకాపా టికెట్టుతో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ గూటికి వెళుతున్న కిడారి తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనా మా చేయాలని వారు గురువారం డి మాండ్ చేశారు. టికెట్టు ఇచ్చిన తల్లిలాంటి వైకాపాకి కిడారి గుడ్‌బై చెప్పడా న్ని నిరసిస్తూ అరకులోయ పట్టణంలో వై కాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మా ట్లాడుతూ దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వైకాపా అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో గిరిజనులు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో కిడారి సర్వేశ్వరరావును అందలం ఎక్కించారని, ఇప్పు డు గిరిజన ఓటర్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నారన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్న నమ్మకంతో కిడారిపై ఆశలు పెట్టుకున్న గిరిజనులు క్షమించరన్నారు. కాసులకు కక్కుర్తిప డి, సొంత వ్యాపార వ్యవహారాలు బ లోపేతం చేసుకొనేందుకే పార్టీ మారుతున్నట్టు వారు ఆరోపించారు. అయితే కిడారి సర్వేశ్వరరావు తెలుగుదేశం గూటికి వెళ్లి పార్టీలు మారడం వలన వైకాపాకి ఎటువంటి ఢోకా లేదని అప్పాలు, రఘునాథ్, అరుణకుమారి, గులాబి స్పష్టం చేశారు.