విశాఖ

కార్మిక సమ్మెను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 18: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 23వ తేదిన దేశ వ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో విశాఖ ఏజెన్సీలోని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సి.ఐ.టి.యు. నాయకుడు ఎల్.సుందరరావు కోరారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో గురువారం సమ్మె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నా భోజన పథకం, ఉపాధి హామీ, సర్వశిక్ష అభియాన్ తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు బడ్జెట్‌లో నిధుల కోత విధిస్తున్నారని, అంగన్‌వాడీలకు నగదు బదిలీ, వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఆశ కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు. కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలను చెల్లించాలని ఎప్పటినుంచో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. దీంతో కార్మికుల న్యాయమైన కోర్కెల సాధనకు చేపడుతున్న సమ్మెలో ఏజెన్సీలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న కార్మికులంతా విధిగా పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని సుందరరావు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు వి.్భగ్యలక్ష్మి, వై.మంగమ్మ, భారతి, జ్యోతి, దేవి, అంబాలమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.