విశాఖ

పద్ధతి మార్చుకోకపోతే పవన్ అక్రమ రాజకీయ లావాదేవీలను నిలదీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మార్చి 17: కేవలం తన వ్యక్తిగత స్వార్ధ రాజకీయ స్వప్రయోజనాల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిఎం చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేష్‌లపైనా వాస్తవ విరుద్దమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించారని విశాఖజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు దుయ్యబట్టారు. స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యాలయంలో శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీష్‌తో కలిసి ఎమ్మెల్యే పంచకర్ల విలేఖర్ల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న సందర్భంలో ఇంతవరకు తమ పార్టీని, అదినేత చంద్రబాబును పొగుడుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాత్రికిరాత్రే మాటమార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సిఎం తనయుడు నారా లోకేష్ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇసుమంతైనా ప్రశ్నించకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం అవిరళంగా శ్రమిస్తున్న సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడిపై అవాకులు, చవాకులు చెప్పడం పవన్ కల్యాణ్‌కు తగదన్నారు. పవన్ తన వైఖరిని మార్చుకోకపోతే ఆయన అక్రమ రాజకీయ లావాదేవీలను నిలదీసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వెనుకాడబోరని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని సిఎం చంద్రబాబు ప్రవేశపెడితే ఎవరో దానిని పక్కదోవ పట్టిస్తే అందుకు చంద్రబాబును బాధ్యులను చేయడం తగదన్నారు. గడచిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా పవన్‌కల్యాణ్ బహిరంగ సభలు నిర్వహించారని, అందుకు తెలుగుదేశం పార్టీ ఆయనను గౌరవిస్తుందన్నారు. అంతమాత్రాన తెలుగుదేశం పార్టీ విజయం పవన్‌కల్యాణ్ వలనే సాధ్యమైందని చెప్పుకోవడం ఆయన అవివేకమన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గతంలో పదేళ్లపాటు సిఎంగా పనిచేసారని, పార్టీకి చెరగని ప్రజాభిమానం ఉందని ఆయన గుర్తుచేసారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాజకీయ ప్రస్థానం సాగించి రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌మోహన్ రెడ్డి పేర్లను మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా కేవలం చంద్రబాబునే టార్గెట్ చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా మొండిచేయి చూపుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యవహార శైలిపై పవన్‌కల్యాణ్ తన వైఖరిని ఆంధ్రా ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు.