విశాఖ

జిసిసిని అవినీతిమయం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 8: గిరిజనుల ఆర్ధికాభివృద్ధిని పెంచేందుకు ఏర్పాటుచేసిన గిరిజన సహకార సంస్థ(జి.సి.సి)ను గత పాలకులు అవినీతిమయం చేశారని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు ఆరోపించారు. జి.సి.సి.ని జేబు సంస్థగా మార్చి నష్టాల్లో ముంచారన్నారు. కోట్లాది రూపాయలు దిగమింగారన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు టిడిపి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నా రు. ఆదివారం నర్సీపట్నంలో కోటి రూపాయలతో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌ను, సోడా హబ్‌ను, ఐటిడిఎ ఐ.పిఎ పథకంలో రూ.85 లక్షలతో నిర్మించిన గిడ్డంగులను మంత్రి ప్రారంభించారు. మంత్రి పెట్రోల్ బంక్‌లో మోటార్ బైక్‌కు స్వయంగా పెట్రోల్ పోసి అమ్మకాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 2014లో రూ.80 కోట్లుగా ఉన్న జి.సి.సి. వ్యాపారం 2014-15లో 182 కోట్లకు పెరిగిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.360 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యం నిర్ణయించామన్నారు. రానున్న మూడేళ్ళలో వెయ్యి కోట్లు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 13 పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 70 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగిందన్నారు. జి.సి.సి. వ్యాపారం మైదాన ప్రాంతాల్లో విస్తరిస్తున్నామని రాజమండ్రి, నర్సీపట్నం,రంపచోడవరంలో పలు వ్యాపారాలు ప్రారంభించి బలపడ్డామన్నారు. మారెడు వేళ్ళతో నన్నారి షర్బత్, పూలతో ఉత్పత్తి చేసిన బిల్వ పానీయాలను మార్కెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. గిరిజనులు పండించిన , సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
విశాఖ మన్యం కాఫీకి అంతర్ జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మన్యంలో కాఫీ గింజల సేకరణను మెరుగుపరుస్తున్నామని, దళారీలు, వ్యాపారుల కంటే రెట్టింపు ధర ఇచ్చి కాఫీ గింజలు కొంటున్నామన్నారు. రాష్ట్రంలో 320 రేషన్ దుకాణాల్లో గిరిజనులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. గిరిజనులు పండించే కాఫీకి అంతర్‌జాతీయ ప్రఖ్యాతి కల్పించేందుకు, సంస్థ అభివృద్ధికి నిపుణులతో సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ సర్వీస్( సెస్)పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 10 మంది సభ్యులతో కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం
రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పాటుపడుతున్నారని మంత్రి కిశోర్‌బాబు అన్నారు. కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ అధిగమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ వర్గాల వారు భాగస్వాములవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు. మున్సిపల్ వైస్ చైర్మెన్ చింకతాయల సన్యాసిపాత్రుడు కోరిక మేరకు గిరిజన గ్రామమైన లింగాపురంలో కమ్యూనిటీ హాల్, బోడకొండమ్మ ఆలయం వద్ద కమ్యూనిటీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈసమావేశంలో జి.సి.సి. ఎం.డి. ఎ. ఎస్.పి. ఎస్. రవిప్రకాష్, పాడేరు జి.సి.సి.డి. ఎం.కె. ఎస్.వి. ఆర్. ఎన్.శర్మ, ఆర్డీవో కె. సూర్యారావు,మంత్రి అయ్యన్నతనయుడు విజయ్‌బాబు, ఎం.పి.పి. సుకల రమణమ్మ, జి.సి.సి.జి. ఎం. అశోక్‌కుమార్ పాల్గొన్నారు.