విశాఖ

పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఏప్రిల్ 26: అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ఐసీడీ ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మరుూదేవి తెలిపారు. గురువారం కోటవురట్ల -5 అంగన్‌వాడీ సెంటర్‌లో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు ప్రీ స్కూల్ సర్ట్ఫికెట్లును పీడీ, స్థానిక ఐసీడీ ఎస్ పీ ఓ ఇందిరాదేవి అందజేసారు. ఈసందర్భంగా పీడీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను కానె్వంట్‌లకు ధీటుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అదనంగా పోషకాహారం అందించేందుకు దాతల సహాయం కోరుతున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయల పెంపకాన్ని చేపడుతున్నామన్నారు. పోషకాహారం లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎసీడీపీ ఓ శాంతి ప్రియ, సూపర్‌వైజర్లు సౌజన్య, ఎం. సత్యశ్రీ పాల్గొన్నారు.

చంద్రన్న పెళ్ళి కానుకను సద్వినియోగం చేసుకోవాలి
కోటవురట్ల, ఏప్రిల్ 26: చంద్రన్న పెళ్ళి కానుక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వరహాలమ్మ సూచించారు. చంద్రన్న పెళ్ళి కానుక ప్రవేశఫెట్టిన తరువాత మండలంలో రాట్నాలపాలెంలో జరిగిన మొదటి వివాహానికి ఎంపీపీ, జన్మభూమి కమిటీ సభ్యులు డీవీ సూర్యారావు, పినపాత్రుని బాబ్జి హాజరయ్యారు. ఈసందర్భంగా వెలుగు ఎపీ ఎం కరుణానిధి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బిసీలకు చంద్రన్న పెళ్ళి కానుక పథకం కింద 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు నేరుగా సంబంధిత వధువు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అయితే వివాహానికి 15 రోజులు ముందు వధూవరులు వివాహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పెళ్ళి వేడుకలో పాల్గొన్న పెద్దలు వధూవరులైన అచ్యుతకుమారి, జీవన్‌కు ఆశీస్సులు అందజేసారు.