విశాఖ

ఆంత్రాక్స్ బాధితులను ఆదుకునేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 26: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ బారిన పడ్డ గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో ఇప్పటికే పలు గ్రామాలలో ఆంత్రాక్స్ ప్రబలి అనేక మంది గిరిజనులు బాధపడుతున్నారని అన్నారు. ఆంత్రాక్స్ బాధితులను విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. ఆంత్రాక్స్ బారిన పడ్డ గిరిజనులకు పది నుంచి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేవిధంగా కలెక్టర్‌తో చర్చించనున్నట్టు ఆమె తెలిపారు. అదేవిధంగా ఆంత్రాక్స్ ప్రబలిన గ్రామాలలో బాధితులతో పాటు గ్రామస్తులందరికీ 35 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆమె చెప్పారు. మన్యంలో ఆంత్రాక్స్ ప్రస్తుతం అదుపులోనే ఉందని, ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం సంబవించలేదని ఆమె అన్నారు. ఆంత్రాక్స్ బారిన పడ్డ గిరిజనులకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ గిరిజనులు తమ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె సూచించారు. మృతి చెందిన పశు మాంసాలను భుజించడం విరమించుకోవాలని ఆమె కోరారు. ఆంత్రాక్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గిరిజనులు సహకరించాలని ఈశ్వరి కోరారు. విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, పలువురు దేశం నాయకులు పాల్గొన్నారు.