విశాఖ

ధర్మపోరాట దీక్షకు జన సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుకుంపేట, మే 22: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షకు హుకుంపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజనులను తరలిస్తున్నట్టు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొర్రా తులసీరావు తెలిపారు. మండలంలోని 33 పంచాయతీల నుంచి జన సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేసామని, ఈ మేరకు 15 బస్సులు, జీపులు వంటి వాహనాలలో పార్టీ శ్రేణులు, గిరిజనులను విశాఖకు పంపుతున్నట్టు ఆయన చెప్పారు. అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు ఆదేశాల మేరకు మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ధర్మపోరాట దీక్షకు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

22 బస్సుల్లో తరలివెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు
కోటవురట్ల, మే 22: రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి ధర్మ పోరాట దీక్ష నిర్వహిస్తున్నట్లు మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు తెలిపారు. విశాఖలో నిర్వహించే ధర్మ పోరాట దీక్షక కాశీనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మండలం నుంచి 22 బస్సుల్లో తెలుగుదేశం కార్యకర్తలు తరలివెళ్ళారు. ఈసందర్భంగా కాశీనాయుడు మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీయాల్సిన వైకాపా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి కేసుల మాఫీ కోసం బీజేపీతో లాలూచీ పడినట్లు కాశీనాయుడు ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ధర్మ పోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు వివరిస్తారన్నారు. కర్ణాటకలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు సుంకర బాబ్జి, పినపాత్రుని బాబ్జి, పీవీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

ధర్మపోరాట దీక్షకు మన్యం తెలుగు తమ్ముళ్లు
పాడేరు, మే 22: విశాఖపట్నంలో ఈ నెల 22వ తేది మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు పాడేరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. స్థానిక శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ ఎం.పి.పి.లు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎం.పి.టి.సి.లతో పాటు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ధర్మపోరాట దీక్షకు పయనమయ్యారు. దేశం నాయకులు, కార్యకర్తలను విశాఖపట్నం తరలించేందుకు ఎమ్మెల్యే ఈశ్వరి ప్రత్యేకంగా బస్సులు, జీపులను సమకూర్చడంతో దాదాపు ఐదు వేల మంది దేశం శ్రేణులు ధర్మపోరాట దీక్షకు వెళ్లారు. ధర్మపోరాట దీక్షకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, జీపులను ఎమ్మెల్యే ఈశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలోని జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలకు చెందిన పార్టీ యంత్రాంగాన్ని ధర్మపోరాట దీక్షకు తరలిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి నాయకులను, కార్యకర్తలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులే కాకుండా అభిమానులు కూడా అధిక సంఖ్యలో విశాఖలో జరిగే ధర్మపోరాట దీక్షకు హాజరవుతున్నట్టు ఆమె చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ తీరును ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారని, దీంతో అధిక శాతం మంది వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుకు వచ్చారని ఆమె అన్నారు. ధర్మపోరాట దీక్ష నుంచి వచ్చిన తరువాత తమ నాయకులు, కార్యకర్తలు కేంద్రం చేసిన మోసంపై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్టు ఈశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు దేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.