విశాఖ

తిరిగి అనకాపల్లి నుండి బరిలోకి దిగేందుకు ఎమ్మెల్యే పీలా సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 17: రానున్న ఎన్నికల్లో తిరిగి అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తహతహలాడుతున్నారు. శనివారం జరగనున్న జన్మదిన వేడుకలు వేదికగా నియోజకవర్గంలో తన వ్యక్తిగత బలం సన్నగిల్లిపోలేదని, మరింత బలపడిందని నిరూపించుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. పార్టీ టిక్కెట్‌పై సిఎం చంద్రబాబు స్వయంగా తనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీపై సానుకూలమైన చర్యలను ప్రభుత్వం చేపడితే తప్ప తిరిగి ఎన్నికల బరిలో దిగే పరిస్థితుల్లో లేనని ఖరాఖండిగా చెప్పానని ఎమ్మెల్యే పీలా స్పష్టం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించే దాడి వీరభద్రరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటకీయంగా ఎమ్మెల్యే పీలా పార్టీ టిక్కెట్‌తోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనదైన పంథాలో అందర్నీ కలుపుకొనిపోతూ ఒకవైపు పార్టీలో అసమ్మతి ముప్పు తలెత్తకుండా చూసుకుంటూ తనకంటూ బలమైన ప్రతిపక్షమే లేని పరిస్థితులను తన రాజకీయ చతురతతో పీలా సృష్టించుకున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఫ్రతిష్టాత్మకమైన అభివృద్ధి జరిగినప్పటికీ కీలకమైన తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ ఉనికిని కాపాడే విషయంలో ఇంతవరకు ప్రతికూలతనే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.
మూతపడిన తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, చెరకు రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు చెక్ పెట్టేందుకు తుమ్మపాల ఫ్యాక్టరీ క్రషింగ్ పునః ప్రారంభానికి రూ.22కోట్ల గ్రాంట్‌ను సిఎం ప్రత్యేకంగా మంజూరు చేశారని పీలా ప్రకటన చేశారు. ఈ ప్రకటన జరిగి నెలరోజులు కావస్తున్నా పరిపాలనా పరమైన ఉత్తర్వులు వెలువడలేదు.
ఇదిలాఉంటే నామినేటెడ్ పదవులు భర్తీ కాకపోవడం, పార్టీ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నేతల మనోభావాలను గుర్తించడం లేదనే అసంతృప్తి పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల్లో గట్టిగానే ఉంది. ఎమ్మెల్యే పీలా వ్యవహార శైలిపై పార్టీశ్రేణుల్లో సాగుతున్న అసంతృప్తి చాపకింద నీరులా సాగుతుంది. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్న నేతలు రానున్న ఎన్నికల్లో ఆయన కాకుంటే తమకు అవకాశం దక్కుతుందని ఎదురుచూసే నేతలు సైతం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తిరిగి టీడీపీ టిక్కెట్ గోవింద్ దక్కించుకోగలరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే శనివారం జరగనున్న జన్మదిన వేడుకలు వేదికగా నియోజకవర్గ నలుమూలల నుండి అనూహ్య రీతిలో పార్టీశ్రేణులు, ప్రజలు తరలిరావడం ద్వారా స్థానికంగా తన బలం సన్నగిల్లిపోలేదని, మరింత బలపడిందని నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా మలుచుకునేందుకు పీలా సన్నద్ధమయ్యారు.