విశాఖ

వెలుగు సిబ్బందిని క్రమబద్దీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, డిసెంబర్ 13: వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళన చేసారు. స్థానిక వెలుగు కార్యాలయం వద్ద బైఠాయించి అపరిష్క్రతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేసారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు ఆర్‌వి స్వామినాయుడు, కె. తాతబాబు తదితరులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆయా కార్యక్రమాలలో తాము పనులు చేస్తున్నా కనీస వేతనాలకు కూడా నోచుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి వెలుగు సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో టి. రమణ, మోదినాయుడు, పైడిరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
16న సబ్బవరంలో వైసీపీ యువసమ్మేళనం సభ
సబ్బవరం, డిసెంబర్ 13 : సబ్బవరం వైఎస్‌ఆర్ సర్కిల్ వద్ద ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువసమ్మేళనం సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ పెందుర్తి అసెంబ్లీసమన్వయ కర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అన్నారు. గురువారం మండలంలోని నంగినారపాడు హైస్కూలు వద్ద జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు రాష్ట్ర వైసీపీ యువజన విభాగం నేత జక్కంపూడి రాజా,రాష్టవ్రైసీపీ యువజన శాఖ అధ్యక్షులు సలామ్‌బాబులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. వారితోపాటు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా తాను నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాభరోసాయాత్రకు స్పందన ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. పరవాడ మండలంలో ముత్యాలమ్మపాలెం, వెనె్నలపాలెంలో అధికార టీడీపీ అడ్డంకులు కలిగించినప్పటికీ ప్రజలు వాటిని లెక్కచేయకుండా ప్రజాభరోసా యాత్రకు సహకారం అందించారని పేర్గొన్నారు. ఎన్నికలు ప్రకటించక ముందే చేపట్టిన పాదయాత్ర వల్ల పలు ప్రాంతాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారికి తగిన హామీ ఇచ్చేందుకు ఎంతో దోహద పడిందన్నారు. పరవాడ మండలంలో ఫార్మాకాలుష్యంతోపాటు ఎన్టీపీసీకి సరఫరా ఆయ్యేబొగ్గులారీలు, ఫ్లైయాష్‌తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వారి బాధలను గాలికొదిలేశారని ఆరోపించారు. రాంకీ సంస్థలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ నాటకీయంగా దీక్షలు చేపట్టిన బండారు తర్వాత నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు.