విశాఖ

పేదల సంక్షేమం, అభివృద్ధికి టిడిపి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.రాయవరం, మే 22: పేద ప్రజల సంక్షేమం కోసమే దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అదే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పాయకరావుపేట పార్టీ మినీ మహానాడు ఏటికొప్పా క షుగర్స్ కల్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. రాష్ట్ర విభజనతో 16వేలకోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం 24వేల కోట్ల రూపాయలు చంద్రబాబు రుణమాఫీ చేశారని, మహిళల డ్వాక్రా రుణాల మాఫీ కోసం ఇప్పటికే 12వేల కోట్లు మంజూరు చేయగా, జూన్‌లో మరో 12వేల కోట్ల రూపాయలను మం జూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయి ంచిందని మంత్రి అయ్యన్న అన్నారు. విద్య, నీటిపారుదల, బిసి, ఎస్సీ సం క్షేమం, ఉపాధి హామీ పథకాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని మంత్రి అయ్యన్న అన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం కింద మూడువేల కోట్లరూపాయల ఖర్చుతో ఈ ఏడాది ఐదువేల కిలోమీటర్ల సిసిరోడ్లు నిర్మించనున్నామని, 14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు మంజూరయ్యే నిధులు పదిశాతం జమ చేసినట్లయితే 90 శాతం నిధులను ప్రభుత్వం మం జూరు చేస్తుందని, ఈ నిధులతో సిసి రోడ్లు నిర్మించుకోవచ్చని మంత్రి అయ్య న్న అన్నారు. వచ్చే ఏడాది డ్రైనేజీల ఏర్పాటు, ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని, చెరువులు తవ్వించుకునేందుకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం కింద పాయకరావుపేట నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు మం జూరు చేసినట్లు మంత్రి అయ్యన్న అన్నారు.
ప్రధానమంత్రి మోదీ ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మించుకుందామంటూ లోక్‌సభలో హామీ ఇచ్చారని, స్థానిక బిజెపి నాయకులు రాజధాని నిర్మాణం పట్ల అభాసుపాలు చేస్తున్నారని, ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవులను సీనియర్ కార్యకర్తలకు నామినేట్ చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీల కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా పలుమార్లు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ మినీమహానాడు ప్రత్యేకత, తీర్మానాలను కార్యకర్తలకు వివరించారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, పార్టీ ఇన్‌చా ర్జి తాజుద్దిన్, నాలుగు మంఢలాల నాయకులు వై.వినోద్‌రాజు, లావణ్య, రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.