విశాఖ

గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన తీర్ధమహోత్సవాలు సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, జనవరి 17: సంక్రాంతి పండుగ వచ్చేందే తడువు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలవారు అతి ఉత్సహంతో బందువులు,స్నేహితులుతోసంతోషంగా గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. మరో రెండు నెలలు వరకుగ్రామీణ ప్రాంతాల్లో ఏదోక మూల తీర్ధాలు, పండుగలు, గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు నిత్యం జరుతూనే ఉంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులు పండుగ అన్ని ప్రాంతాల్లోఘనంగా నిర్వహిస్తారు.గ్రామీణ ప్రాంతాల్లోమాత్రం సంక్రాంతి పండుగ నుండి తీర్ధమహోత్సవాలు మొదలవుతాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగాగ్రామాల్లో అమ్మవారి పేరుమీద, దివాంగత నేతలు, దేవుళ్ళుపేరుపై నిత్యం తీర్ధమహోత్సవాలు, జాతరలు నిర్వహించడంతోప్రతీరోజు సంక్రాంతి సందడి వాతావరణం నెలకొంటుంది. సంక్రాంతి మొదలుకొని ఒక ఆనవాయితీగా తీర్ధమహోత్సవాలు జరగడంతో వారాలుతో పనిలేదు. పట్టణాలుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి ఎక్కువగా ఉంటుదని చెప్పవచ్చు రోజుకోక గ్రామంలో తీర్ధం జరగడంతోఆయా నిర్వాహుకులు సందర్శకులును ఆకట్టుకొనే విధంగా పలు పోటీలు నిర్వహిస్తారు. ఎండ్లపందెలు, గుర్రం, క్రీడలు, కోడి పందాలు తోపాటు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా కోలాటం, ముగ్గుల పోటీలు, తోడపెద్దుసేవ, స్వాముగరిడీ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈసందర్బంగా బందువులను, స్నేహితులను ఆహ్వానించి కుటుంబ సభ్యులతోతీర్ధంలో జరుగుతున్న పోటీలను సంతోషంగా తిలకిస్తారు. పిల్లల్లో ఉన్న చిన్నచిన్న కోరికలు రంగుల రాట్నం, జంపిగ్, రింగాట, ఆట వస్తువులు, ఇంటిలో అవసరమైన వస్తువులు కొనుగోలుచేస్తారు. దీంతో చిల్లర వ్యాపారస్తులకు రెండునెలలుపాటు జీవనాధరంగా ఈతీర్ధమహోత్సవాలు దోహదపడతాయని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉదయం పూట వ్యవసాయ పనులు చేసుకొని మధ్యాహ్నాం తీర్ధాల్లో జరిగే పోటీలను తిలగించడానికి ఉత్సహం చూపుతారు.దీంతో గ్రామాల్లో సంక్రాంతి సందడి నిత్యం కనిపిస్తుంది.

దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ
అనకాపల్లిటౌన్, జనవరి 17: సంక్రాంతి పండుగను పురష్కరించుకొని వికలాంగుల హక్కుల జాతీయ వేధిక అధ్వర్యంలోదివ్యాంగులకు గురువారం స్థానిక గవరపాలెం దివ్యాంగుల కార్యాలయం వద్ద దుప్పట్లు, చీరలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి బుగిడి నూక అప్పారావు వీటిని అందజేసారు. ఈ సందర్బంగా అప్పారావు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న ఫించన్లు అత్యంత నిరుపేద కుటుంబాలకు ఒకే రేషన్‌కార్డులో అర్హులైన ఇద్దరికి వర్తించే విధంగాప్రభుత్వం ఆమలుచేయాలని ఆయన డిమాండ్ చేసారు. సామాజిక సేవలుపై యువత ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ రెహామాన్, బుద్ద ధనలక్ష్మి, కె వరలక్ష్మి, ఎం రాజుబాబు, ఎం అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

ప్రసాద్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి పట్ల హర్షం
కొయ్యూరు, జనవరి 17: టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవీ ఎస్ వీ ప్రసాద్‌ను ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంపై ఆపార్టీ మండల నేతలు , ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ప్రసాద్‌కు ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం పట్ల స్వగ్రామం కొయ్యూరులో పార్టీ నేతలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కో ఆప్షన్ సభ్యుడు బకీర్ ఖాన్, ఎంపీటీసీ సరస్వతి, నేతలు దొరబాబు, చక్రరరావు, బూరుగులయ్య తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రసాద్‌కు అభినందనలు తెలుపుతూ కేక్ తినిపించారు. ప్రసాద్‌కు పదవీ నియామకంపై సీ ఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈసందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా మంత్రులు అయ్యన్న, గంటా, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి తదితరులు తనపై నమ్మకంతో సహకరించారని వారికి అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన పదవికి వనె్న తెచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. అలాగే చింతపల్లి ఎ ఎంసీ చైర్మెన్ చిట్టిబాబు, నియోజకవర్గం నేత కొట్టగుళ్ళి సుబ్బారావు, ఎంపీటీసీలు శివరామరాజు, అక్కమ్మ, లోతా భీమరాజు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రసాద్ తల్లి జయలక్ష్మి, సోదరులు అశోక్, రాజశేఖర్, కుటుంబ సభ్యులు నేతల రమణయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

నడింపాలెంలో అలరించిన రంగ వల్లులు
కొయ్యూరు, జనవరి 17: మండలంలో నడింపాలెంలో ముక్కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు యర్రగొండయ్య యూత్ సభ్యులు జి.మణిదీప్, పి. శ్రీనుల ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువతులు పోటాపోటీగా ముగ్గులు వేసారు. పోటీల్లో ఏర్పాటు చేసిన ముగ్గులు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ సాంభశివరావులు అందజేసారు. ఈకార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువత పాల్గొన్నారు.

రాయితీపై ఇచ్చిన ఆవు మృతి
కొయ్యూరు, జనవరి 17: కొయ్యూరు గ్రామానికి చెందిన మొట్టడం సావిత్రికి రాయితీపై అందించిన జెర్సీ ఆవు మృతిచెందడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈనెల 12న స్ట్రైకర్ రుణాల్లో భాగంగా లక్ష రూపాయలకు ఆమెకు రెండు జెర్సీ ఆవులను పంపిణీ చేసారు. వాటిలో ఒక ఆవు గురువారం మృతి చెందింది. రాయితీపై రుణాలల్లో అందించిన ఆవు నాలుగు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు అధికారులే న్యాయం చేకూర్చి ఆదుకోవాలని ఆమె కోరుతుంది.

అగ్ని ప్రమాద బాధితుడికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలి
మాకవరపాలెం, జనవరి 17: మండలంలోని సుభద్రయ్యపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుడికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. బుధవారం గ్రామానికి కన్నూరు గంగరాజుకు చెందిన పశువుల పాక గడ్డివాముతో పాటు ఐదు పశువులు కాలిపోయిన విషయం తెలిసిందే. ఈప్రమాదంలో సుమారు లక్షా 60 వేల వరకు ఆస్తినష్టం జరిగింది. ఈవిషయం తెలుసుకున్న గణేష్‌తో పాటు మండల పార్టీ నాయకులు గురువారం బాధితుడిని కలిసి , దగ్దమైన పశువుల పాకను పరిశీలించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి తమ వంతు సహాయంగా 10 వేల రూపాయల నగదు అందించారు. ప్రభుత్వం కూడా జరిగిన నష్టంపై సహాయం అందించాలన్నారు. బాధితుడికి ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ సీనియర్ నాయకుడు రుత్తలయర్రాపాత్రుడు డిమాండ్ చేసారు. ఆయన కూడా బాధితుడిని పరామర్శించారు. ఈసందర్భంగా బాధితునికి రెండు లక్షల ఆర్ధిక సహాయం అందించి పశువుల కొనుగోలుకు మిగిలిన మూడు లక్షలు ప్రభుత్వం అందించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఆయన వెంట పై రాజుబాబు, రమేష్ ,పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి చిటికెల రమణ, పి. గోవిందరావు, పార్టీ నాయకులు గొంతిన హరిబాబు, బాలకృష్ణ, పి. భద్రాచలం, రుత్తల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.