విశాఖ

22 వరకూ ఒంటిపూట బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వడగాల్పులు, ఎండల దృష్ట్యా ఈ నెల 22 వరకూ ఒంటి పూట బడులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కాగా, ఎండల దృష్ట్యా ఇప్పటి వరకూ ఒంటి పూట బడులనే కొనసాగించారు. అయితే వాతావరణ పరిస్థితుల ఇంకా వేసవిని తలపిస్తూ, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఒంటి పూట బడులను ఈ నెల 22 వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలల్లోని విద్యా సంస్థలు విధిగా ఆదేశాలు పాటించాలని సూచించారు. 24వ తేదీ నుంచి యధావిధిగా పాఠశాలలు పనిచేస్తాయని తెలిపారు.

ఆర్‌ఇసిఎస్‌కు తక్షణం ఎన్నికలు జరపాలి
సబ్బవరం, జూన్ 16 : గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్న అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఇసిఎస్)కు తక్షణం ఎన్నికలు జరిపించాలని కోరుతూ అగనంపూడి అభివృద్థి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అగనంపూడి వచ్చిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను స్థానిక పార్టీనేతలతో కలిసిన ఆయన ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా నూతన ఎమ్మెల్యే గుడివాడకు వినతి పత్రం అందజేశారు. అందులో పేర్గొన్న ప్రకారం తక్షణం ఆర్‌ఇసిఎస్‌కు ఎన్నికలు జరిపించాలని, వినియోగదారులకు సౌకర్యం కల్పించేందుకు సోలార్ విద్యుత్‌ను ఆ సంస్థ తరపున కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ తాత గుడివాడ అప్పన్న, ఆయన తండ్రి గుడివాడ గురునాథరావుతోతమ గ్రామానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అగనంపూడికి సంబంధించి పలు సమస్యల పరిష్కారం కోసం సత్యనారాయణ ఎకరువుపెట్టారు.