విశాఖ

అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ - కార్నర్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మే 30: ఈ- కార్నర్ విధానం ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు మరింత చేరువ అయ్యాయని ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్‌కుమార్ పండిట్ అన్నారు. స్థానిక ఎస్‌బిఐ వ్యవసాయ శాఖ బ్రాంచిలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్నర్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 29 బ్రాంచ్‌ల్లో ఈ - కార్నర్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ విధానం ద్వారా 24 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సిడిఎం .మిషన్లు నిరంతరం పని చేసేందుకు వీలుగా ఛానల్ కో ఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో ఈ - కార్నర్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో చిట్టివలస, మాడుగుల బ్రాంచిల్లో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సాధారణ విధానంలో చేపట్టే అన్ని రకాల సేవలను ఒకే చోట క్షణాల్లో పూర్తి చేసుకునే అవకాశం ఈ కేంద్రాల ద్వారా కలుగుతుందన్నారు. వీటిలో ఎటిఎంలు, నగదు డిపాజిట్ యంత్రాలు, పాస్ బుక్ ప్రింటింగ్ సౌకర్యం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్‌బుక్, ఎటిఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, రైల్వే, బస్ టిక్కెట్ల బుకింగ్ సదుపాయం కల్పించామన్నారు. ఈ -కార్నర్ సేవలను దశల వారీగా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నర్సీపట్నం బ్రాంచ్‌లో రద్దీ కారణంగా సేవలు అందడంలో జాప్యం జరుగుతుందన్నారు. అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎజిఎం రవిచంద్రన్, ఎడిబి బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ అహ్మద్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.