విశాఖ

అది ప్రమాదమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం)అనకాపల్లి, మే 30: అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లావణ్య కేసుకు ఎట్టకేలకు నగర పోలీసు కమిషనర్ టి.యోగానంద్ తెర దించారు. కావాలనే హేమంత్‌కుమార్ అతని స్నేహితులు ఆమెను అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయం వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడి అనంతరం ఆమె మోటారుబైక్‌పై వెళ్తుండగా సాలాపువానిపాలెం వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేశారన్న ఆరోపణలను సిపి కొట్టి పారేశారు. కేసు మాఫీ చేయడానికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున బేరసారాలు సాగించినట్టు ప్రచారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిందితులను కేసు నుండి రక్షించడానికి బాధితురాలి కుటుంబానికి రూ.పది లక్షలు చెల్లించడానికి బేరం ఒప్పుకుని, ఇప్పటికే రూ.ఐదు లక్షలు చెల్లించారని, అందుకనే లావణ్య ఆడపడుచు దివ్య మొదట మీడియాలో ఓ రకంగా మాట్లాడి తర్వాత మరో రకంగా పోలీసులకు వాంగ్ములం ఇవ్వడంతో కేసు పక్కదారి పట్టినట్టు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసు కమిషనర్ కూడ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తల వంచక తప్పలేదని అందుకనే దీనిని రోడ్డు ప్రమాదంగా చీత్రీకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా నిందితులపై పోలీసులు పెట్టిన సెక్షన్లు కూడ పెద్ద బలమైనవి కావని రోడ్డు ప్రమాదంగా కోర్టులో కేసు నిరూపణ అయితే మహా రెండేళ్ళ జైలు శిక్ష మాత్రమే పడుతుందని, అయితే ఇప్పటికే బాధితురాలి కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్న నిందితుల తరుపున కుటుంబీకులు, వారిని కోర్టులో కూడ మేనేజ్ చేయగలరని, ఇక నిందితులకు ఆ శిక్ష కూడ పడడం కష్టమని కేసును పరిశీలించిన పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈనెల 22న వడ్లపూడి గ్రామానికి చెందిన మాటూరి లావణ్య, భర్త అప్పలరాజు, ఆడపడుచు దివ్య, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి మోటారుబైక్, కారులో వెళ్ళిన విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం లావణ్య భర్త అప్పలరాజు, ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఇంటికి వెళ్లిపోగా, అమ్మవారి ఆలయం వద్ద ఉండిపోయిన లావణ్య, ఆడపడుచు దివ్య, మోహన్‌కుమార్ కలిసి మోటారుబైక్‌పై వెళ్తుండగా ఈ సంఘటన జరిగి లావణ్య మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఫైనాన్ష్ వ్యాపారి అయిన దాడి హేమంత్‌కుమార్, అతని స్నేహితుడు బోడ్డేటి హేమంత్ కలిసి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కారులో అక్కడ నుండి విశాఖకు బయలు దేరారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న హేమంత్‌కుమర్ సెల్‌ఫోన్‌లో జ్ఞానాపురంలోని ఓ వ్యక్తి ఇవ్వాల్సిన అప్పు డబ్బులు కోసం మాట్లాడుతుండగా ఎదురుగా ఉన్న లావణ్య ప్రయాణిస్తున్న మోటారుబైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఆమె మృత్యువాత పడినట్టు పోలీసుల కథనం. ఇందుకు సంబంధించి సోమవారం పోలీసు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో హేమంత్‌కుమార్, హేమంత్‌లను సిపి హాజరు పరిచి, కేసు వివరాలను స్వయంగా తెలియజేశారు. నూకాలమ్మ ఆలయంలోని సిసి కెమెరాల పుటేజ్‌లో పై ఇద్దరు లావణ్యను ఈవ్‌టీజింగ్ చేసినట్టు ఎక్కడ లేదని, కాని ఆ విధంగా మీడియాలో ప్రచారం జరిగిన విషయం వాస్తవం కాదని ఆయన అన్నారు. అయితే అమ్మవారి ఆలయం బయట 22సిసి కెమెరాలుండగా అందులోని ఫుటేజ్‌లను పోలీసులు బయట పెట్టక పోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రోడ్డు ప్రమాదంలో లావణ్య మృతి చెందినట్టయితే నిందితుల కుటుంబీకులు భారీ మొత్తంలో నగదు చెల్లించడానికి బాదితురాలి కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని విలేఖరులు సిపిని ప్రశ్నించారు. అయితే దీనిపై ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, ఎవరి వద్దనైన నిందితులు కావాలని లావణ్యను హత్య చేసినట్టు గాని, లేదా లక్షలు రూపాయలు చెల్లించి బేరం కుదుర్చుకున్నట్టు గాని సాక్షాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా సిపి విలేఖరులను, ప్రజలను కోరారు. ఏది ఏమైన నగరంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లావణ్య కేసు పోలీసుల దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా తేలింది.