విశాఖ

వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, మే 30: మన్యం నుండి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా వున్న ఎండు గంజాయిని ముందస్తు సమాచారంతో స్ధానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. జి.మాడుగుల ఎస్.ఐ. డి.శేఖరం విలేఖరులకు అందించిన వివరాలు ప్రకారం మండలంలోని సొలభం పంచాయితీ వట్టివెగిసె గ్రామంలో సుమారు 950 కిలోలు 270 ప్యాకెట్లుగా చేసి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడుతుండగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. గంజాయి తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిలో ముగ్గురు పరారీ కాగా ఒకరు పట్టుబడ్డారని ఆయన అన్నారు. గంజాయితో పట్టుబడిన సంపతి క్రిష్ణబాబుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు వుంటుందని ఆయన అంచనా వేసారు.
రావికమతం: రావికమతం, గొలుకొండ మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల దాడుల్లో లక్షలాది రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. 11మందిపై కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే రావికమతం మండలం వేర్వేరు ప్రాంతాల్లో పది లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిపై రావికమతం, కొత్తకోట ఎస్సైలు సోమవారం కేసు నమోదు చేశారు. మండలంలో కసిరెడ్డిపాలెం తరలించేందుకు గంజాయి సిద్ధంగా ఉన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేయగా ఐదు లక్షల విలువైన 110 గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రావికమతం ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పడాల లోవరాజు, గుర్రాలనాగేష్‌ను అందించి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మండలంలో చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవ రిజర్వాయర్ రహదారిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మాటు వేయగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు 100 కిలోల గంజాయిని తరలిస్తూ తమకు పట్టుబడినట్లు కొత్తకోట ఎస్సై శిరీష్‌కుమార్ తెలిపారు. మత్స్యరాజు, నాగరాజు, సన్యాసినాయుడు,సోమేశ్వరరావులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
గొలుగొండ: విశాఖ ఏజన్సీ నుండి గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్.జోగారావు తెలిపారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామం నుండి చెల్లంగి బాల సుందర్‌రావు, పెట్ల వెంకటేశ్వర్లు(50), పెట్ల హరిబాబు(21), ఎస్.రాంబాబు(19), ఎస్. శ్రీను(20)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. చింతపల్లి నుండి డౌనూరు చెక్‌పోస్టు నుండి చిట్టింపాడు మీదుగా మైదాన ప్రాంతమైన జోగుంపేట చేరుకున్నారన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
వీరు గంజాయిని తుని వ్యాపారులకు చేరవేసేందుకు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. నిందితుల నుండి మూడు సెల్‌ఫోన్లు, 1,100 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై జోగారావుతెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షా 20 వేలు ఉంటుందని తెలిపారు.