విశాఖ

అధ్వాన్న రోడ్డు మరమ్మతులకు వైకాపా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, జూన్ 9: అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు గతుకులు పడి స ంవత్సరాలు గడుస్తున్నా ఆర్‌అండ్‌బి అ ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైకాపా నాయకులు, కార్యకర్తలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్జి బొడ్డేడ ప్రసాద్ సారద్యంలో వైకాపా శ్రేణులు అనకాపల్లి- అచ్యుతాపురం ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. గురువారం స్థానిక రిక్షాల స్టా ండ్ దగ్గర ఉదయం 9 నుండి 11 గం టల వరకు రాస్తారోకో నిర్వహించారు. దీనివలన ట్రాపిక్ భారీస్థాయిలో నిలిచిపోయింది.
ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. స్థానిక ఎస్‌ఐ కలుగజేసుకొని ఆర్‌అండ్‌బి అధికారులను సంఘటన స్థలానికి రప్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అనేక సార్లు ఆందోళన నిర్వహించామని, చివరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి రోడ్డుపై నిత్యం జరిగే ప్రమాదాలను వివరించామన్నారు. స్పందించిన కలెక్టర్ రోడ్డు పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించినా ఆర్‌అండ్‌బి అధికారులు కనీసం పట్టించుకోలేదని, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోక పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బి జెఇ నర్సింహమూర్తి మాట్లాడు తూ ఇప్పటివరకు రోడ్డు మరమ్మతుల కు డబ్బులేదని, ప్రస్తుతం 10 లక్షల రూపాయలు మంజూరు అయిందని వా రం రోజుల్లో టెండర్‌లు పిలుస్తామని, వెంటనే రోడ్డు పనులు చేపడతామని అర్డర్ కాపీని ఆందోళనకారులకు చూ పించారు. తాత్కలిక మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్సి మళ్ల నాగసన్యాసిరావు, మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు, వైకాపా నేతలు మొల్లేటి శంకర్, బొడ్డేడ అప్పలనాయుడు, పెంటకోట అప్పలనాయుడు, దాడి పోలీస్, మళ్ల కృష్ణ, బొడ్డేడ శ్రీనివాసరావు, నరాలశెట్టి సూర్యనారాయణ, పల్లెల ప్రకాశ్ పాల్గొన్నారు.