విశాఖ

విద్యాబోధనలో మార్పులు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 9: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు రావాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఇండియా ఎడ్యుకేషన్ కలెక్టివ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ లో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యావిధానంలో నాణ్యతలు లోపిస్తున్నాయన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్య బోధనలో మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థుల భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేయాలన్నారు. ప్రభుత్వం అనేక ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసినప్పటికీ మన్యం విద్యార్థులు ఫలితాలు సాధించలేకపోతున్నారన్నారు. దీని కారణంగా ఏజెన్సీ విద్యావిధానంలో మార్పులు రావాలని ఆయన కోరారు. ఈ శిక్షణలో ఐ.ఇ.సి. ఇన్‌చార్జి డి.ఈశ్వరయ్య, సి.ఎం.ఒ.. ఎ.రేణుకా ప్రసాద్, ఎ.ఎం.ఒ పి.సత్యనారాయణ, పార్వతీపాల్గొన్నారు.